Dhanush : ‘సార్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

-

తెలుగు డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో కోలీవుడ్ క్రేజీ హీరో ధనుష్ మొదటిసారి చేసిన తెలుగు చిత్రం సార్.. ఈ సినిమాను తమిళ్లో వాతి పేరిట రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా గత నెల విడుదలై మొదటి షో తోనే మంచి పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది.

ఇందులో సంయుక్త మేనన్ ధనుష్ సరసన హీరోయిన్గా నటించిన విషయం తెలిసిందే. ఇక ఇటీవల థియేటర్లలో హిట్ టాక్ తెచ్చుకున్న ‘సార్’ ఓటీటీ రిలీజ్ కు సిద్ధమైంది. ధనుష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. తాజాగా ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయింది. మార్చి 17 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుందని నెట్ ఫ్లిక్స్ ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version