న్యూజిలాండ్‌లో మన సిరిసిల్ల పట్టు..ఫోటోలు వైరల్

-

తెలంగాణ ఆడపడుచులకు పెద్దన్నగా ముఖ్యమంత్రి కేసీఆర్ బతుకమ్మ కానుకగా చీరలు పంపిణీ చేస్తున్నారు. ప్రతి ఏడాది లాగే ఈ ఏడాది కూడా బతుకమ్మ చీరల పంపిణీకి రంగం సిద్ధం చేశారు. అయితే.. న్యూజిలాండ్ లో సిరిసిల్ల పట్టుచీర ‘రాజన్న సిరిపట్టు’ బ్రాండ్ ను భారత సంతతికి చెందిన ఆ దేశమంత్రి ప్రియాంక రాధాకృష్ణ ఆవిష్కరించారు.

అంతర్జాతీయ వేదికల పైన మన సిరిసిల్ల పట్టు ఆకర్షిస్తుండటం పై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి ప్రియాంక రాధాకృష్ణన్ కు ధన్యవాదాలు తెలిపారు. న్యూజిలాండ్ లో సిరిపట్టు బ్రాండ్ లాంచ్ కార్యక్రమంలో జూమ్ ద్వారా పాల్గొన్న కేటీఆర్, సిరిసిల్ల పట్టుచీర ప్రాముఖ్యతపై వీడియో సందేశాన్ని పంపారు.

అనంతరం సిరిసిల్ల నేతన్న ఉత్పత్తులు ప్రపంచ వేదికలపై ఆవిష్కారం కావడం ఎంతో సంతోషాన్ని ఇస్తుంది అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అనేక కార్యక్రమాల కారణంగా ఒకప్పుడు సంక్షోభంలో ఉన్న సిరిసిల్ల నేతన్నలు ఇప్పుడు వినూత్న ఉత్పత్తులతో ప్రపంచాన్ని ఆకర్షించడం గర్వంగా ఉందని కేటీఆర్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version