TSPSC పేపర్ లీకేజి కేసులో మరో ముగ్గురు అరెస్ట్…

-

తెలంగాణాలో కొన్ని రోజుల క్రితం జరిగిన TSPSC గ్రూప్ 1 పేపర్ లీక్ విషయం ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో చూశాము. ఈ కేసులో కొందరిని విచారించి ఇందులో ప్రత్యక్షముగా పరోక్షముగా ప్రమేయం ఉన్న అందరినీ అరెస్ట్ చేశారు. కానీ కొందరు ఈ మధ్యనే బెయిల్ మీద విడుదల అయ్యారు. కాగా తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మరో ముగ్గురు నిందితులను SIT అరెస్ట్ చేయడం జరిగింది. ఇంతకు ముందునే అరెస్ట్ చేసిన రవి కిషోర్ అనే నిందుతుడి వద్ద భరత్ నాయక్ , రోహిత్ కుమార్ మరియు సాయి మధు అనే అభ్యర్థులు పేపర్ ను కొనుగోలు చేసినట్లు గుర్తించి వీరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ రోజు అరెస్ట్ చేసిన ఈ ముగ్గురితో కలిపి మొత్తం ఈ కేసులో అరెస్ట్ అయిన వారి సంఖ్య 40 కు చేరుకుంది.

 

 

 

ఇక ముందు ముందు ఇంకెంతమందిని అరెస్ట్ చేయనుంది అన్నది తెలియాల్సి ఉంది. కాగా ఈ ముగ్గురిని విచారణ చేస్తే మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది.

 

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version