వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా “సీతారామం” !

-

దుల్కర్ సల్మాన్ హీరోగా, మృనాల్ ఠాకూర్ హీరోయిన్ గా డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన పీరియడ్ రొమాంటిక్ డ్రామా సీతారామం. సీతారామం మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం థియేటర్లలో విడుదల అయ్యి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. డిజిటల్ ప్రీమియర్ గా ప్రేక్షకులను అలరించిన ఈ చిత్రం, ఇప్పుడు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కి సిద్ధం అవుతోంది. త్వరలో ఈ చిత్రం వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా స్టార్ మా లో ప్రసారం కానుంది. వైజయంతి మూవీస్, స్వప్న సినిమాస్ బ్యానర్ లపై అశ్విని దత్ నిర్మించిన ఈ చిత్రంలో రష్మిక మందన్న, సుమంత్ లు కీలకపాత్రలో నటించారు. ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version