ఈ నెల 10 వరకూ మఠంలోని వారికి సమయం ఇచ్చామని శివస్వామి స్పష్టం చేశారు. ఈలోపు మంత్రి వెలంపల్లికి మధ్యంతర నివేదిక ఇచ్చామని ఆయన వెల్లడించారు. వీరబ్రహ్మేంద్రస్వామి కుటుంబ సభ్యులు ఏకాభిప్రాయానికి వస్తారని ఆశిస్తున్నామని వ్యాఖ్యానించారు. కోర్టుకు వెళతామని వీరబ్రహ్మేంద్రస్వామి రెండవ భార్య తరపు వారు కూడా అంటున్నారని తెలిపారు. కుటుంబ పరమైన ఆస్తులు వారి స్వవిషయమన్నారు. వీరబ్రహ్మేంద్రస్వామి మఠం ఆస్తుల విషయంలో కుటుంబీకులకు వెళ్లే అవకాశం లేదని తేల్చి చెప్పారు. బ్రహ్మం గారి మఠం కీర్తిని కాపాడాలని కుటుంబ సభ్యులను కోరుతున్నామని చెప్పారు. చట్ట ప్రకారం ధార్మిక కమిటీ వేయాలని మంత్రిని కోరామన్నారు. తాత్కాలిక ఈఓ ను నియమించాలని కూడా కోరామని పేర్కొన్నారు. నాలుగు ధర్మ శాస్త్రాలలో ఉన్న విషయాలు చర్చించామని, పదవ తారీఖయ తరువాత తుది నివేదిక ఇస్తామని శివస్వామి స్పష్టం చేశారు.
బ్రహ్మం గారి మఠం వివాదం: మంత్రికి చేరిన ప్రాథమిక నివేదిక
-