నిరుద్యోగులకు శుభవార్త. భారతీయ రైల్వే (railway jobs) మంత్రిత్వ శాఖకు చెందిన డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (DFCCIL) లో ఖాళీలు వున్నాయి. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే.. 1074 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
జూనియర్ మేనేజర్, ఎగ్జిక్యూటీవ్‌లు, జూనియర్ ఎగ్జిక్యూటీవ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. జూలై 23 లోగ దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, ఆసక్తి వున్న వాళ్ళు అర్హులు. ముఖ్యంగా ఇంజనీరింగ్ చేసిన వారు అర్హులు. అభ్యర్థులు పూర్తి వివరాలకు https://dfccil.com/ వెబ్సైట్ లో చూడచ్చు.
ముంబై కేంద్రంగా పనిచేస్తున్న వెస్టర్న్ రైల్వేకి చెందిన రైల్వే రిక్రూట్మెంట్ సెల్ (ఆర్ఆర్సీ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 3591 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్ట్ కోసం పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణులైన వాళ్లు అప్లై చేసుకోవచ్చు.
జూన్ 24 లోగ అప్లై చేసుకోవాలి. అలానే సదరన్ రైల్వేలో 3378 అప్రెంటీస్ పోస్టులు ఖాళీగా వున్నాయి. పెరంబూర్‌లోని క్యారేజ్ వర్క్స్‌లో 936, గోల్డెన్‌రాక్ వర్క్‌షాప్‌లో 756, పొడనూరులోని సిగ్నల్ అండ్ టెలికామ్ వర్క్‌షాప్‌లో 1686 పోస్టులున్నాయి.
జూన్ 30 లోగ దరఖాస్తు చేసుకోవచ్చు. https://sr.indianrailways.gov.in/ వెబ్సైట్ లో పూర్తి వివరాలు చూడచ్చు. ఇలా మూడు నోటిఫికేషన్లలో 8043 పోస్టులను భర్తీ చేయనున్నారు.