SLBC ఆపరేషన్ లో 56 గంటలవుతున్నా 8 మంది ఆచూకీ ఇంకా దొరకలేదు. సొరంగంలో ప్రతికూల పరిస్థితులతో…11వ కిలోమీటర్ దాటి లోపలికి రెస్క్యూ టీమ్స్ లోపలి వెళ్లలేకపోతున్నాయి. నీరు.. బురద.. బోరింగ్ మిషన్‌కు సంబంధించిన మెటీరియల్.. బయటికి తెచ్చేందుకు చర్యలు చెప్పారు. కానీ ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ ఆడిపోయింది. లోపల నీరు, మట్టి దిబ్బలు, బోరింగ్ మెషీన్ శిథిలాలు తొలగిస్తే తప్ప రెస్క్యూ ఆపరేషన్ చేయలేమని చెప్తుంది ఎన్డీఆర్ఎఫ్.
అక్కడి పరిస్థితిని చూసి ఇప్పటికే నేవీ టీమ్స్ వెనుదిరగగా. ర్యాట్ మైనర్స్ ను లోపలికి అనుమతించలేదు పోలీసులు, అధికారులు. అందువల్ల భారం అంతా NDRF పైనే ఉంది. లోపల మట్టిని తొలగించేందుకు టన్నెల్ లోపలికి మినీ జేసిబి ని పంపారు అధికారులు. అయితే జేసిబి మట్టిని తవ్వుతుంది కానీ.. దానిని మళ్ళీ లోపలే కుప్పగా పోస్తే రెస్క్యూ కి అడ్డంకి గా మారుతుందని ఎన్డీఆర్ఎఫ్ చెప్పగా.. జేసిబిని వెన్నక్కిపంపారు. ఈరోజు రాత్రి నీటి తీవ్రత పెరిగితే.. రేపు 10 కిలోమీటర్లు కూడా వెళ్ళడం కష్టమని భావిస్తున్నాయి రెస్క్యూ టీమ్స్. దాంతో చిక్కుకున్న 8 మంది ఆచూకీ పై ఆశలు సన్నగిల్లుతున్నాయి.