తెలంగాణ రాష్ట్రంలోని slbc సొరంగం ఘటనలో… కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ సొరంగంలో మొత్తం 50 మంది కూలీలు ఇరుక్కుపోయినట్లు ప్రాథమిక సమాచారం. ఇందులో 42 మందిని సురక్షితంగా బయటికి తీసుకువచ్చిందట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అలాగే స్వరంగంలోనే ఎనిమిది మంది కార్మికులు చిక్కుకున్నట్లు తెలుస్తోంది.
ఆ ఎనిమిది మంది సజీవంగా ఉన్నారా లేదా మరణించారా అనే విషయం తెలియాల్సి ఉంది. నిన్నటి నుంచి వాళ్లంతా లోపలే ఉన్నారు. సొరంగంలో కరెంటు అలాగే గాలి… ఆహారం లేదు. దీంతో రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు దిగాయి. ఆ ఎనిమిది మందిని తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు.