అవినీతి, కుటుంబ పాలనకు మారుపేరు టిఆర్ఎస్ – స్మృతి ఇరానీ

-

అవినీతి, కుటుంబ పాలనకు మారుపేరు టిఆర్ఎస్ అని మండిపడ్డారు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు వచ్చిన ఆమె ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ పై మండిపడ్డారు. రాజ్యాంగ ఉల్లంఘనకు మారుపేరు సీఎం కేసీఆర్ అని ఎద్దేవా చేశారు. ప్రధానికి స్వాగతం పలికే ప్రోటోకాల్ ను కూడా పాటించని నేత కెసిఆర్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో కేసీఆర్ హయాంలో రాచరిక పాలన కొనసాగుతోందని మండిపడ్డారు.

పేదల అభ్యున్నతి బీజేపీతోనే సాధ్యం అని అన్నారు. రెండు కళ్ళ విధానం బీజేపీలో చెల్లుబాటు కాదని తెలియజేశారు. పేదలకు జెన్ధన్ కాతా తోపాటు రూపాయికే భీమా కల్పిస్తున్నామని తెలియజేశారు. రాష్ట్రపతి అభ్యర్థిగా గిరిజన మహిళను నిలబెట్టిన ఘనత ఎన్డీఏదేనని స్మృతి ఇరానీ తెలిపారు.ప్రధాని మోదీ అనుసరిస్తున్న విధానం మాకు ప్రేరణ అని తెలిపారు.దేశంలో అవినీతి నిర్మూలనకు ప్రధాని మోదీ కృషి చేస్తున్నారని, మహిళా సాధికారత గురించి బిజెపి ఆలోచిస్తుందని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version