అలారం స్నూజ్‌ చేసి మళ్లీ మళ్లీ పడుకుంటున్నారా..? మెదడుపై ప్రభావం పడుతుందట..

-

అలారం సౌండ్‌తోనే నిద్రలేచేవాళ్లు ఎంతో మంది ఉంటారు. అయితే అలారం పెట్టేప్పుడు ఉన్నంత ఉత్సాహం తెల్లారి అది మోగుతుంటే లేచేప్పుడు ఉండదు.. ఇంకొంచెం సేపు ఆగిలేద్దాంలే అనుకుంటాం..కొందరైతే..లేవాలనుకున్న టైం కంటే గంట ముందే అలారం పెట్టుకుంటారు..ఎలాగూ అది మోగగానే లేవబుద్ధి కాదు.. స్నూజ్‌ చేసుకుంటూ చేసుకుంటూ లేవచ్చులే అని..అలారాన్ని స్నూజ్‌ చేసుకుంటూ లేవడం వల్ల ఆరోగ్యం పాడవుతుందని నిపుణులు అంటున్నారు.. అవునా..అలా ఎలా..?

స్నూజ్ బటన్ కనిపెట్టిన కొత్తలో మనిషి ఉత్తమ ఆవిష్కరణలలో ఒకటిగా అనిపించింది… ఎందుకంటే ఆ అదనపు నిమిషాలు తమకు నిద్రలో సహాయపడతాయని చాలా మంది భావించారు. ఓ టైంకి లేవాలి అనుకున్నప్పుడు.. అలారం పెట్టుకుంటాం. కానీ అదే అలారం మోగాకా.. స్నూజ్ బటన్ ప్రెస్ చేసి మళ్లీ పడుకుంటాం. ఇది చాలా చెడ్డ అలవాటు..ఎందుకంటే మన శరీరానికి దాని సొంత గడియారం ఉంటుంది. అందుకే ఒక్కోసారి ఈ సమయానికి లేవాలి అనుకుంటే.. అలారం లేకపోయినా.. కరెక్టుగా అదే సమయానికి నిద్రలేస్తాం.

ఒక నిద్ర చక్రం 70-95 నిమిషాల నిడివి ఉంటుందట.. సగటు 80 నిమిషాలకు సరిగ్గా సరిపోతుంది. మనలో చాలా మందికి రాత్రి సమయంలో మూడు నుంచి నాలుగు నిద్ర చక్రాలు ఉంటాయి. ఉదయం మన శరీరం సహజంగా లేవడానికి ఒక గంట ముందు నుంచే మన మెదడు, శరీరాన్ని సిద్ధం చేయడం ప్రారంభిస్తుంది. ఇది “మేల్కొలపడానికి సిద్ధంగా ఉన్న మోడ్” లాంటిది. అందుకే మీరు లేవడానికి ముందు నుంచే నిద్రలో ఉన్నప్పటికీ బయట ఏం జరుగుతుందో తెలుస్తూ ఉంటుంది. ఆ శబ్ధాలు వినిపిస్తూ ఉంటాయి…

పనికి ఆలస్యం కాకూడదని అలారం పెట్టుకుంటారు. కానీ అది మోగినప్పుడు.. స్నూజ్ బటన్ ప్రెస్ చేసి మళ్లీ పడుకుంటారు. తాత్కాలికంగా ఆపివేయడం.. మళ్లీ నిద్రలోకి వెళ్లడం మంచిది కాదు అంటున్నారు నిపుణులు. దానివల్ల మీరు మీ మెదడుకు రాంగ్ డైరక్షన్స్ ఇస్తున్నారని అర్థం. ఎందుకంటే ఇది “వేక్-అప్ మోడ్”లో కాకుండా నిద్ర చక్రం మధ్యలో మెదడుకు అంతరాయం కలిగిస్తుందట..

ఇలా నిద్రలో లేచి మళ్లీ స్నూజ్‌ బటన్‌ నొక్కుతూ నిద్రపోవడం వల్ల.. మెదడు ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. దీనివల్ల మీరు నిద్రలేచినా.. ఆ నిద్ర మీద వ్యామోహంతోనే ఉంటారు. మీ మెదడు చురుకుగా పనిచేయదు. సమాచారాన్ని ప్రాసెస్ చేయడం, కొత్త విషయాలను గుర్తుంచుకోవడం, కొత్త విషయాలను నేర్చుకోవడం, భయం, ఆందోళన, కోపం, ఒత్తిడి, చికాకు వంటి భావోద్వేగాలను నియంత్రించడం చాలా కష్టతరం అవుతుంది.

ఒకే అలారంతో లేవడం కష్టంగానే ఉంటుంది. కానీ అలా లేస్తే ఆరోగ్యకరమైన జీవనశైలిని పొందవచ్చు. వారాంతాల్లో తప్ప ప్రతిరోజు ఉదయం ఒకే సమయంలో నిద్రలేవడానికే శరీరం ఇష్టపడుతుందట. అందుకే మీరు గమనించండి. వారాంతాల్లో.. మీరు నిద్ర ఆలస్యంగా లేచినా.. ఆరోజంతా మీరు బద్ధకంతో ఉంటారు. అది పనివల్ల ఒత్తిడి అనుకుంటారు కానీ.. దాని కారణం రోజూ అలవాటైన సమాయానికి కాకుండా.. ఆలస్యంగా నిద్రలేవడమే.

వీక్‌ ఆఫ్‌లో ఎక్కువ సేపు పడుకుందాం అనుకుంటారు.. అలా అనీ మరీ అంత ఎక్కువే పడుకోలేరు.. రోజూ లేచేదాని కంటే ఒక గంట గంటన్నర ఎక్కువ.. కానీ ఆ టైం మీ డే మొత్తం మీద ఎఫెక్ట్‌ అవుతుంది. అప్పుడే రోజు అయిపోయినట్లు అనిపిస్తుంది. బద్ధకంగా ఉంటుంది. వీక్‌ ఆఫ్‌ రోజు ఉదయం ఎర్లీగా లేస్తే మీకు ఎంతో సమయం ఉన్నట్లు అనిపిస్తుంది. కావాలంటే నైట్‌ త్వరగా పడుకోవచ్చు. వీక్‌ ఆఫ్‌ ఎంజాయ్‌ చేయాలంటే ఒకసారి ఈ టెక్నిక్‌ ఫాలో అయి చూడండి.!
Attachments area

Read more RELATED
Recommended to you

Exit mobile version