ఈ రకం గుడ్లగూబలు సహజంగా మనకి కనిపించవు. చాల అరుదుగా ఇవి కనపడుతుంటాయి. ఇదో అరుదైన గుడ్లగూబ ఇది. ఎప్పుడో కానీ ఇవి కనపడవు. ఇది చాల విచిత్రంగా ఉంటుంది. ఈ వింత గుడ్లగూబ గురించి వివరంగా చూస్తే… ఇది 1890 ప్రాంతంలో అమెరికాలో కనపడడం జరిగింది. అయితే అప్పుడు ఎప్పుడో కనపడిన ఈ వింత గుడ్లగూబ మళ్ళీ ఇప్పుడు న్యూయార్క్ లోని సెంట్రల్ పార్క్ జూ లో కనిపించి వైరల్ అవుతోంది.
ఈ మంచు గుడ్లగూబలు ఆర్కిటిక్ ప్రాంతం లోని టండ్రాల్లో నివసిస్తుంటాయని పేర్కొన్నారు. శీతాకాలం లో మాత్రం ఇవి దక్షిణ దిశగా ప్రయాణిస్తాయని తెలిపారు. అక్కడకి వచ్చే ప్రతీ ఒక్కరిని ఇది ఆశ్చర్యపరిచింది. పక్షి ప్రేమికులు సైతం ఎందరో ఇక్కడకి వచ్చి దీనిని ఎగబడి చూస్తున్నారు. అంతా కలిసి దీనితో ఫోటోలు కూడా తీసుకుంటున్నారు.
ఈ అరుదైన మంచు గుడ్లగూబ ఫోటోలు ఇప్పుడు నెట్టింటి లో తెగ షికార్లు కొడుతున్నాయి. ఎంతో మంది ఫొటోలు తీసేస్తూ ఉండడం తో ఇది బాగా బెదిరిపోతోంది. దీనితో అధికారులు దూరంగా ఉండమని జనాల్ని అదుపు చేయడం జరిగింది. ఈ గుడ్లగూబని మామూలుగా కాదు బైనాక్యులర్లు ఉపయోగించి చూడాలట.