సామాజిక దూరం పరిష్కారం కాదా…?

-

సామాజిక దూరం పాటిస్తే కరోనా వైరస్ ని కట్టడి చేయవచ్చు అని ప్రపంచం మొత్తం చెప్తుంది. ఎక్కడి వారు అక్కడ ఉండి సామాజిక దూరం పాటిస్తే అది చచ్చిపోతుంది అని వ్యాఖ్యానిస్తున్నారు. కరోనా విస్తరిస్తున్న అన్ని దేశాల్లో కూడా ఇలాంటి వ్యాఖ్యలే ఎక్కువగా వినపడుతున్నాయి. నిజంగా సామాజిక దూరం కరోనా వైరస్ ని కట్టడి చేస్తుందా అంటే చెప్పలేని పరిస్థితి ఇప్పుడు నెలకొంది. చెప్పలేము అనే అంటునారు నిపుణులు.

ఉదాహరణకు ఒక ఫోన్ కరోనా వైరస్ సోకిన వ్యక్తి పట్టుకున్నాడు అనుకుందాం. ఆ వ్యక్తికి కరోనా సోకింది అనే విషయం ఎంత మాత్రం తెలియదు. ఇప్పుడు ఆ ఫోన్ వేరే వ్యక్తి ఏదో అవసరం వచ్చి తీసుకుని చెవులో పెట్టుకుని మాట్లాడాడు. మరి అప్పుడు ఆ వైరస్ మరో వ్యక్తికి కచ్చితంగా అంటుకునే అవకాశాలు ఉంటాయి కదా…? అలాగే తెలియకుండా ఏదైనా వస్తువు తాకినా సరే కరోనా మరో వ్యక్తి నుంచి మరో వ్యక్తికి వెళ్ళినట్టే కదా..?

అంటే సామాజిక దూరం ఒక్కటే కాదు. కరోనా వైరస్ ని కట్టడి చెయ్యాలి ఇంకా చాలా చెయ్యాల్సి ఉంటుంది. సామాజిక దూరం ఒక్కటే పరిష్కారం అనే విధంగా కొంత మంది వ్యాఖ్యలు చేస్తున్నారు. కాని అది పరిష్కార మార్గం కాదని, దీని కట్టడికి ఇంకా సరికొత్తగా ఆలోచించాల్సిన అవసరం ఉందని పలువురు సూచిస్తున్నారు. నిజంగా సామాజిక దూరం ప్రభావం చూపిస్తే మన దేశంలో కరోనా కట్టడి కావాలి.

కాని అది మన దేశంలో కట్టడి అయ్యే పరిస్థితి కనపడటం లేదు. ఇక మందు కనుక్కోవడం ఒక్కటే దీనికి పరిష్కారం అని అనే వాళ్ళు ఉన్నారు. పొరపాటున వ్యక్తిని తాకినా సరే అది సోకుతుంది. దానికి తెలియదు కదా తెలిసి తాకింది తెలియక తాకింది, కాబట్టి ఇప్పుడు దీనికి పరిష్కారం మందు కనుక్కోవడమే అనే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. ఎంత త్వరగా కుదిరితే అంత త్వరగా కనుక్కోవాలని సూచిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version