సోషల్‌ మీడియా పిచ్చి.. ప్రపంచంలోనే అత్యంత నల్లని పెయింట్‌ను ఒంటికి రాసుకున్న యూట్యూబర్‌

-

ఫాలోవర్స్‌, లైక్స్‌ కోసం సోషల్‌ మీడియాలో ఏవేవో చేస్తుంటారు. కొన్నిసార్లు వాళ్లు చేసేవి చూస్తుంటే ఆశ్చర్యపడాలో, ఆందోళన చెందాలో అర్థంకాదు..ఓ యూట్యూబర్‌ తన ఫాలోవర్స్‌ను యట్రాక్ట్‌ చేసుకోడానికి వింతైన పని చేశాడు. దాంతో అతనే వింతగా కనిపిస్తున్నాడు. తెల్లగా బొమ్మలా ఉండేవాడు.. ఇప్పుడు ఇంత నల్లగా తయారయ్యాడు. అది మనిషా, నిడా అని కూడా అర్థంకావడం లేదు.. అసలేం జరిగిందంటే..

ఇతగాడి పేరు హజీమ్. జపాన్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన యూట్యూబర్. ఇతడు చేసే రకరకాల వింత పనులు జపనీయులను బాగా ఆకట్టుకుంటాయి. కొత్త కొత్త ప్రయోగాలు చేసి.. సదరు వీడియోలను షూట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాడు. ఇతడి వీడియోలను జపనీయులు ఎగబడి మరీ చూస్తుంటారు. ఇతడు పోస్ట్ చేసే ప్రతి వీడియోకు భారీ సంఖ్యలో వ్యూస్ వస్తుంటాయి. తాజాగా ప్రపంచంలోనే అత్యంత నల్లదైన పెయింటింగ్ను ఒంటికి పూసుకుని ఆశ్చర్యపరిచాడు. ఈ ఫోటోలను తన ట్విట్టర్‌లో పోస్టు చేయడంతో అందరూ అవాక్‌య్యారు..

ముసౌ బ్లాక్, ఇది ప్రపంచంలోనే అత్యంత నల్లని పెయింట్.. కొయో ఓరియంట్ జపాన్ అనే సంస్థ ఈ పెయింట్‌ను అభివృద్ధి చేసి విక్రయిస్తోంది. ఈ పెయింట్‌ను ఎక్కడ పూసినా.. 99.965% వరకు కనిపించే కాంతిని గ్రహించే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ పెయింట్ అత్యంత ఖరీదైనది కూడా. ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో ఈ పెయింట్ అందుబాటులో లేదు. కేవలం అమెజాన్ ఆన్ లైన్ ఫ్లాట్ ఫామ్‌లో మాత్రమే లభిస్తుంది. 100ml పెయింట్ ఖరీదు ఏకంగా $17 (సుమారు రూ.1400) ధర పలుకుతోంది.

ఎప్పుడూ ఏదో ఒక తుంటరి పనులు చేసే ఈ జపనీస్‌ వాగర్‌ ఇటీవల బ్లాక్ ముసౌ పెయింట్‌ను ఉపయోగించి ప్రపంచంలోని అత్యంత నల్లని గదిని సృష్టించాలి అనుకున్నాడు. అనుకున్నట్లుగానే ఓ రూంకు నల్లటి రంగు వేశాడు. ఆ తర్వాత తన మిత్రుడి కళ్లు మూసి ఆ రూంలోకి తీసుకెళ్లాడు. అతడు ఈ నల్లటి గదిని చూసి ఆశ్చర్యపోయాడు. అదే సమయంలో ఇతరులు తనను చీకటిలో చూడగలుగుతారా? అని తెలుసుకునేందుకు తనకు తానుగా ముసౌ బ్లాక్ పెయింట్‌ను ఒంటికి రాసుకుంటాడు. చీకటిలో ఉన్న హజీమ్‌ను తన స్నేహితుడు కూడా గుర్తించలేకపోతాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను తన యూట్యూబ్ ఛానెల్ లో పోస్టు చేశాడు.

ఈ యూట్యూబ్ వీడియోకు పెద్ద సంఖ్యలో వ్యూస్ వచ్చాయి. అటు ఒంటికి వేసుకున్న నల్లటి రంగును అలాగే ఉంచుకుని మిట్ట మధ్యాహ్నం సమయంలో స్థానిక బీచ్‌కు వెళ్లాడు. నల్లటి రంగుతో అతడి రూపం కేవలం నీడ మాదిరిగానే ఉంది. ఆ ఫోటోలను తను ట్విట్టర్ వేదికగా అభిమానులతో పంచుకున్నాడు.. మరి ఆ పెయింట్‌ అలానే ఉంటుందా..పోతుందా అనేది ప్రశ్నార్థకమే..

Read more RELATED
Recommended to you

Exit mobile version