డ్రగ్స్ విక్రయిస్తున్న సాఫ్ట్వేర్ ఇంజినీర్.. జీతం సరిపోవడం లేదనే!

-

మన దేశంలో సాఫ్ట్వేర్ ఇంజినీర్లకు కొదువలేదు. సాఫ్ట్వేర్ జాబ్ అనగానే లక్షల్లో జీతం ఉంటుంది. జాబ్ టైమింగ్స్, పికప్ డ్రాప్ సైతం ఉంటాయి. సాధారణంగా లక్షల్లో జీతం ఉన్నవారికి కోరికలుర సైతం బాగానే ఉంటాయి. దాంతో తమ జీతం అంతా ఏదో రకంగా ఖర్చు చేసేస్తుంటారు. ఈ క్రమంలోనే జీతం సరిపోవడం లేదనే కారణంతో ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ పార్ట్ టైం డ్రగ్స్ విక్రయించడం మొదలెట్టాడు.

డ్రగ్స్‌ తెచ్చేందుకు మహారాష్ట్ర, పుణెకు వెళ్లి 120 మిల్లీ గ్రాముల ఎండీఎంఎ క్రిస్టల్స్‌ డ్రగ్స్‌ను తీసుకొని హైదరాబాద్‌కు వస్తున్న క్రమంలో సంగారెడ్డి డీటీఎప్‌,ఎక్సైజ్‌ పోలీసులు సోమవారం మల్కాపూర్‌ ప్లై ఓవర్‌ తనిఖీలు నిర్వహించి నిందితుడు వస్తున్న వాహనాన్ని పట్టుకున్నారు. జమ్మూకు చెందిన హర్జత్‌ సింగ్‌ (35) అనే వ్యక్తి హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్. డ్రగ్స్‌కు అలవాటు పడి తనకు వచ్చే జీతం మొత్తం దానికే ఖర్చు చేస్తున్నాడు. దీంతో డ్రగ్స్ సప్లయర్ అవతారం ఎత్తి తోటి ఉద్యోగులకు డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్నట్లు పోలీసులు విచారణలో తేల్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version