నేటి నుంచి గ్రామ, వార్డు సభలు.. అర్హులకే పథకాలు, రేషన్ కార్డులు : మంత్రి పొన్నం

-

రాష్ట్రంలో ప్రభుత్వం అందజేయనున్న నాలుగు పథకాలు, రేషన్ కార్డుల జారీ ప్రక్రియపై గందరగోళం నెలకొన్న నేపథ్యంలో మంత్రి పొన్నం సోషల్ మీడియా ఎక్స్ వేదికగా మంగళవారం స్పందించారు. జనవరి 26 నుంచి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయబోయే 4 పథకాలు (ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా) విషయంలో ప్రజలు ఎవ్వరూ ఆందోళన చెందవద్దని.. అర్హులకు తప్పకుండా పథకాలను వర్తింపజేస్తామన్నారు.

నేటి నుంచి గ్రామాల్లో గ్రామ సభలు, వార్డు సభలు నిర్వహిస్తున్నందున అర్హులు అక్కడకు వెళ్లి అధికారుల సమక్షంలో రేషన్ కార్డులు లేనివారు, ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. ఎవరికైనా అర్హత ఉండి ప్రభుత్వ పథకాలు రాకపోతే గ్రామ సభలో అప్లికేషన్‌లు పెట్టుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.ప్రతిపక్షాల మాటలు విని మోసపోవద్దని ఆయన హితవుపలికారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version