Breaking: హైదరాబాద్​లో సోలార్​ రూప్ సైక్లింగ్​ ట్రాక్​.. నేడు శంకుస్థాపన చేయనున్న కేటీఆర్​

-

హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ మరో మణిహారం రానుంది. అభివృద్ధి చెందిన దేశాల తరహాలో ఆధునిక సైకిల్ ట్రాక్ లో తెలంగాణ ప్రభుత్వం నిర్మించనుంది. తొలిత ఐటీ ఉద్యోగులను దృష్టిలో పెట్టుకొని నానక్‌రాం గూడా నుంచి టీఎస్పీఎస్ వరకు ఎనిమిదిన్నర కిలో మీటర్లు అలాగే నార్సింగి నుంచి కొల్లూరు వరకు మరో 14.5 కిలో మీటర్ల మేరకు సర్వీస్ రోడ్లకు ఇరువైపులా ఈ ట్రాక్లు నిర్మించనున్నారు.

అనంతరం విడుదల వారీగా ట్రాక్ అందుబాటులోకి రానుంది. ఇందులో భాగంగానే ఇవాళ తెలంగాణ ఐటి శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు పురపాలక శాఖ ప్రత్యేక కార్యదర్శి హెచ్ఎండిఏ కమిషనర్ అరవింద్ కుమార్ తన ట్విట్టర్ వేదికగా ప్రకటన చేశారు.

సాధారణ సైకిల్ ట్రాక్ మాదిరిగా కాకుండా ఆధునిక వసతులతో దీనిని తీర్చిదిద్దుతున్నారు. దక్షిణ కొరియాలోని డీజియా నుంచి సేజొంగ్ నగరాల మధ్య 32 కిలోమీటర్ల పరిధిలో ఆధునిక వసతులతో ఉన్న సైకిల్ ట్రాక్ ను ఇటీవల హెచ్ఎండి అధికారులు పరిశీలించి వచ్చిన సంగతి తెలిసిందే. అదే తరహాలోనే హైదరాబాద్ లో నిర్మించనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version