కేంద్ర ప్రభుత్వం నేడు పార్లమెంటులో ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ పై స్పందించారు ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. ఆదాయపు పన్ను స్లాబ్ రేట్లు ఊరటనిచ్చాయని అన్నారు. ఆర్థిక లోటు తగ్గడం మంచి పరిణామం అన్నారు బుగ్గన. గ తేడాది బడ్జెట్ మూలధనం 7.28 లక్షలు ఉండగా.. ఈసారి 10 లక్షలకు పెరిగినట్టు బడ్జెట్ లో చెప్పారని వివరించారు. ఎరువులు, యూరియా, బియ్యం, గోధుమలు సబ్సిడీకి కేటాయింపులు తగ్గాయి అన్నారు.
అయితే రాష్ట్రాలకు సంబంధించిన అంశాలను ప్రస్తావించలేదన్నారు. రాష్ట్రాలతో నిర్వహించిన ప్రీ బడ్జెట్ సమావేశాలలో మన సూచనలను పరిగణలోకి తీసుకున్నారని తెలిపారు. పౌరసరఫరాలకు కేటాయింపులు తగ్గినట్లు భావిస్తున్నామని తెలిపారు. రైల్వే స్టేషన్ లో వసతులకు పెద్దపీట వేసినట్లు కనిపిస్తుంది అన్నారు బుగ్గన. వ్యక్తిగత పన్ను రాయితీలు కొన్ని ప్రకటించడాన్ని హర్షిస్తున్నామన్నారు.