ప్రకాశం : బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణ కాదని…స్టీల్ ప్లాంట్ ని కాపాడే బాధ్యత ఏపి బీజేపీదని స్పష్టం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ఉద్యమం చేస్తున్న నాయకులు డెయిరీలు, స్పిన్నింగ్ మిల్లులు, షుగర్ ఫ్యాక్టరీలు ప్రవేటీకరణ చేస్తే ఏం చేశారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పెట్రోల్, డీజీల్ ధరలు పెరగడం వలన సామాన్యులపై భారం పడిందని…. దీనిపై బీజేపీ ఆవేదన చెందుతోందన్నారు. పెట్రోల్, డీజీల్ ధరలు కేంద్రానికి ఆదాయ వనరులు కాదని పేర్కొన్నారు.
ఇది ఇలా ఉండగా… ప్రైవేటీకరణకు కేంద్ర ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో 100 శాతం పెట్టుబడులు ఉపసంహరించి, ప్రైవేటీకరణ చేయాలని నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా కీలక అడుగులు వేసింది. దానికి అనుబంధంగా గల ఇతర సంస్థలు కంపెనీలు అన్నిటినీ మదింపు చేసి న్యాయపరంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా వ్యవహారాన్ని ముందుకు నడపడానికి న్యాయ సలహాదారు కావాలంటూ ఉక్కు మంత్రిత్వ శాఖ రెండు రోజుల క్రితం కీలక ప్రకటన విడుదల చేసింది.