ధర తక్కువలో అదిరిపోయే ఫీచర్స్ తో సోనీ టీవీ..

-

సోనీ కంపెనీ ప్రపంచ వ్యాప్తంగా మంచి పేరు ఉంది. ప్రముఖ బ్రాండ్ కంపెనీ ఎలక్ట్రానిక్స్‌ వస్తువులను తయారు చేస్తున్న కంపెనీలలో ఇది ఒకటి.మొబైల్స్, ల్యాప్ టాప్,టీవీ లతో పాటు మరెన్నో ఎలెక్ట్రిక్ వస్తువులను అందిస్తుంది.వాటి క్వాలిటీ, ధర రీజనబుల్ గా ఉండటంతో ఈ బ్రాండ్ వస్తువులకు మార్కెట్ లో డిమాండ్ భారీగా పెరిగింది.కాగా,తాజాగా మరో స్మార్ట్ టీవీని మార్కెట్ లోకి విడుదల చేసింది.సోనీ బ్రేవియా 32W830K గూగుల్ టీవీ. దీని స్క్రీన్ సైజు 32 అంగుళాలుగా ఉంది. ఇది ఒక హెచ్‌డీ రెడీ టెలివిజన్. హెచ్‌డీఆర్10, హెచ్ఎల్‌జీ ఫార్మాట్లను ఇది సపోర్ట్ చేయనుంది.

ఈ టీవీ ధర, ఫీచర్లు..

ఈ టీవీ ధరను మనదేశంలో రూ.28,999గా నిర్ణయించారు. అన్ని సోనీ సెంటర్లు, ప్రముఖ ఎలక్ట్రానిక్ స్టోర్లు, ఈ-కామర్స్ పోర్టళ్లలో ఈ టీవీని కొనుగోలు చేయవచ్చు..ఇందుకు సంభందించిన సేల్ కు ఇప్పటికే మన దేశంలో మొదలైంది.32 అంగుళాల హెచ్‌డీ రెడీ ఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. హెచ్‌డీఆర్, హెచ్ఎల్‌జీ ఫార్మాట్లను ఇది సపోర్ట్ చేయనుంది. దీని డిస్‌ప్లే ప్యానెల్ రిజల్యూషన్ 1368×768 పిక్సెల్స్‌గానూ, రిఫ్రెష్ రేట్ 60 హెర్ట్జ్‌గానూ ఉంది.

ఆండ్రాయిడ్ టీవీ ప్లాట్‌ఫాంపై ఈ కొత్త టీవీ పనిచేయనుంది. గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్ కూడా దీంతోపాటు అందించనున్నారు. వాయిస్ రిమోట్ ద్వారా దీన్ని కంట్రోల్ చేయవచ్చు. ఇంటిగ్రేటెడ్ క్రోమ్ కాస్ట్, యాపిల్ హోం కిట్ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.20W స్టీరియో స్పీకర్లను ఈ టీవీలో అందించారు. డాల్బీ ఆడియో, క్లియర్ ఫేజ్ ఫీచర్లు కూడా సోనీ అందించింది. ఎక్స్-ప్రొటెక్షన్ ప్రో టెక్నాలజీని కూడా ఉంది. డస్ట్ అండ్ హ్యుమిడిటీ ప్రొటెక్షన్ ఈ టీవీలో ఉండటం విశేషం. ఇందులో మూడు హెచ్‌డీఎంఐ పోర్టులు, రెండు యూఎస్‌బీ పోర్టులు, ఒక ఎథర్‌నెట్ పోర్టు, రెండు ఆడియో ఇన్‌పుట్స్, డిజిటల్ ఆర్క్ పోర్టు, బ్లూటూత్ 5, వైఫై కనెక్టివిటీ ఆప్షన్లు ఉన్నాయి..ఇంకా ఎన్నో ఫీచర్లను అందించారు. మొత్తానికి ఈ టీవీకి మార్కెట్ లో విడుదలైన కొద్ది రోజుల్లోనే మంచి డిమాండ్ ఏర్పడింది..

Read more RELATED
Recommended to you

Exit mobile version