దేశంలోని ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పనుంది. ఇకపై వారికి నెల నెలా కనీసం రూ.5వేల పెన్షన్ అందించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈ మేరకు బుధవారం దీనిపై ఓ ప్రత్యేక కమిటీ చర్చించనుంది. అందులో ఈపీఎస్ ను నెలకు కనీసం రూ.5వేలు ఇవ్వాలని నిర్ణయం తీసుకోనున్నారు.
1995లో అప్పటి కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల కోసం ఎంప్లాయీ పెన్షన్ స్కీం (ఈపీఎస్)ను అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా ప్రైవేటు రంగంలో పనిచేస్తున్న సంఘటిత ఉద్యోగులు, కార్మికులు రిటైర్ అయ్యాక నెల నెలా పెన్షన్ తీసుకోవచ్చు. 1952 ఈపీఎఫ్ స్కీం ప్రకారం ఉద్యోగుల పీఎఫ్ నుంచి 8.33 శాతం ఎంప్లాయీ పెన్షన్ స్కీంకు వెళ్తుంది. 58 ఏళ్ల తరువాత ఉద్యోగం నుంచి రిటైర్ అయితే నెల నెలా ఈపీఎస్ ద్వారా పెన్షన్ ఇస్తారు. అయితే ఈ పెన్షన్ మొత్తాన్ని నెలకు కనీసం రూ.5వేలు చేయనున్నారు. దీనిపైనే బుధవారం చర్చించి నిర్ణయం తీసుకుంటారు.
ఇక 2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను ఈపీఎఫ్ వడ్డీని 8.5 శాతం చెల్లించారు. అయితే 2020-21 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్ వడ్డీ రేట్‌ను పెంచనున్నారు. దీనిపై డిసెంటర్ లేదా జనవరిలో నిర్ణయం తీసుకుంటారు. దీని వల్ల ఉద్యోగులకు తమ పీఎఫ్‌పై ఎక్కువ వడ్డీ లభిస్తుంది.