నార్త్‌ మార్కెట్‌ని ఫోకస్‌ చేస్తోన్న సౌత్ హీరోలు

-

సౌత్‌ ఇండియన్ మూవీస్‌కి బౌండరీస్‌ చెరిగిపోతున్నాయి. ఇన్నాళ్లు లోకల్‌ మార్కెట్‌నే ఫోకస్‌ చేసిన సౌత్‌ స్టార్స్‌ ఇప్పుడు ఇండియన్ మార్కెట్‌ని టార్గెట్ చేస్తున్నారు. నార్త్‌లోనూ టాలెంట్‌ చూపించడానికి రెడీ అవుతున్నారు. అక్కడి సిట్యువేషన్స్‌ని వాడుకుంటూ, ఉత్తరాదిలోనూ జెండా పాతుతున్నారు దక్షిణాది హీరోలు.

తెలుగు, తమిళ్, కన్నడ అనే తేడా లేకుండా ప్రభాస్‌ నుంచి ధనుష్‌ వరకు అంతా పాన్‌ ఇండియన్‌ మార్కెట్‌పై ఫోకస్‌ పెడుతున్నారు. సౌత్‌ స్టోరీస్‌తో ఇండియన్‌ బాక్సాఫీస్‌ని ఇంప్రెస్‌ చెయ్యడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ప్రభాస్‌ మూడు పాన్‌ ఇండియన్‌ మూవీస్ ప్రిపేర్ చేస్తోంటే, బాహుబలి రూట్‌లో మరికొంతమంది నార్త్‌కి వెళ్తున్నారు.టాలీవుడ్‌ టాప్‌ స్టార్స్ జూ.ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరూ మార్కెట్‌ పెంచుకునే పనిలో పడ్డారు. తెలుగు నుంచి హిందీ బెల్ట్‌ వరకు స్టార్డమ్‌ని విస్తరించుకోవాలనుకుంటున్నారు. రాజమౌళి డైరెక్షన్‌లో పాన్‌ ఇండియన్‌ మూవీ ‘ట్రిపుల్ ఆర్’తో నార్త్‌కి వెళ్తున్నారు తారక్, చరణ్. ఇప్పటికే రిలీజైన టీజర్స్‌తో బీటౌన్‌లో కూడా ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి.

తెలుగుతోపాటు మళయాళంలోనూ క్రేజీ మార్కెట్ సంపాదించుకున్న అల్లు అర్జున్ ఇప్పుడు నార్త్‌లోనూ హంగామా చెయ్యాలనుకుంటున్నాడు. అందుకే ‘పుష్ప’ సినిమాని పాన్‌ ఇండియన్ మూవీగా ప్లాన్ చేశాడు అల్లు అర్జున్. ఎర్రచందనం అక్రమ రవాణా నేపథ్యంలో సుకుమార్‌ డైరెక్ట్‌ చేసిన ఈ సినిమా తెలుగు,తమిళ, కన్నడ, మళయాళ, హిందీ భాషల్లో రిలీజ్ అవుతోంది. కెరీర్‌ బిగినింగ్‌లో సౌత్‌ స్టార్‌ అనిపించుకోవాలనుకున్న విజయ్ దేవరకొండ, ఇప్పుడు పాన్‌ ఇండియన్‌ ఇమేజ్‌ కోసం ట్రై చేస్తున్నాడు. పూరీ జగన్నాథ్‌ డైరెక్షన్‌లో ‘ఫైటర్‌’ సినిమాతో నార్త్‌కి వెళ్తున్నాడు విజయ్. అయితే మల్టీలింగ్వల్‌గా రిలీజైన ‘నోటా, డియర్‌ కామ్రేడ్’ సినిమాలకి పాజిటివ్ రెస్పాన్స్ రాలేదు. మరి ఈ ‘ఫైటర్’ విజయ్‌కి పాన్‌ ఇండియన్‌ ఇమేజ్‌ తీసుకొస్తాడా అన్నది చూడాలి.

బాలీవుడ్‌ స్టార్లు బాక్సాఫీస్‌ దగ్గర సత్తా చాటలేకపోతున్నారు. ఖాన్స్‌ ఒక్కహిట్ అని తిరుగుతోంటే, హృతిక్ రోషన్‌ లాంటి హీరోలు మెప్పించలేకపోతున్నారు. దీంతో బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ దగ్గర వ్యాక్యూమ్ క్రియేట్ అవుతోంది. ఈ సిట్యువేషన్‌ని వాడుకోవడానికి నార్త్‌కి వెళ్తున్నారు సౌత్‌ హీరోలు. షారుఖ్‌ ఖాన్‌ ‘జీరో’ ఫ్లాప్‌ తర్వాత మళ్లీ కనిపించలేదు. సల్మాన్ ఖాన్ ‘భారత్, దబాంగ్ 3’ లాంటి యావరేజ్‌ మూవీస్‌తో స్లో అయ్యాడు. ఇక ఆమిర్ ఖాన్ ‘థగ్స్‌ ఆఫ్ హిందుస్తాన్’ డిజాస్టర్‌తో డల్ అయ్యాడు. హృతిక్ రోషన్‌ లాంటి వాళ్లు ప్రేక్షకులని సాటిస్‌ఫై చెయ్యలేకపోతున్నారు.

నార్త్‌ ఆడియన్స్ కూడా సౌత్‌ స్టోరీస్‌కి ఇంప్రెస్ అవుతున్నారు. అందుకే మన కమర్షియల్‌ మూవీస్‌కి అక్కడ సూపర్‌ రెస్పాన్స్ వస్తోంది. ఈ సిట్యువేషన్‌ని వాడుకుంటూనే నార్త్‌లో ‘కె.జి.ఎఫ్.’ని రిలీజ్ చేసి, క్రేజీ ఫాలోయింగ్‌ తెచ్చుకున్నాడు కన్నడ స్టార్ యశ్. ఇప్పుడు ‘కె.జి.ఎఫ్.2’ తో ఈ క్రేజ్‌ని మరింత పెంచుకోవడానికి ట్రై చేస్తున్నాడు.

తమిళ్లో యూనిక్ స్టోరీస్‌తో సెపరేట్‌ ఇమేజ్‌ తెచ్చుకున్న ధనుష్‌, హిందీలోనూ స్టార్డమ్ సంపాదించుకుంటున్నాడు. ఇప్పటికే హిందీలో ‘రాంజాన, షమితాబ్’ సినిమాలు చేసిన ధనుష్, ఇప్పుడు అక్కడ స్ట్రాంగ్ మార్కెట్‌ సంపాదించాలనుకుంటున్నాడు. అందుకే తమిళ్‌కీ, హిందీకి వేర్వురుగా కాకుండా, పాన్‌ ఇండియన్‌ మూవీసే చెయ్యాలనుకుంటున్నాడట ధనుష్. ‘రాచ్చసన్’ ఫేమ్‌ రామ్‌ కుమార్ డైరెక్షన్‌లో ఒక పాన్‌ ఇండియన్‌ మూవీ చేస్తున్నాడు ధనుష్.

Read more RELATED
Recommended to you

Exit mobile version