కేరళ లిక్కర్ స్కామ్‌లో ఎమ్మెల్సీ కవిత హస్తం : ఎంపీ అర్వింద్

-

నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ మరోసారి ఎమ్మెల్సీ కవితపై సంచలన కామెంట్స్ చేశారు. కేరళ లిక్కర్ స్కామ్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హస్తముందని, ఈ విషయాన్ని కేరళ పొలిటికల్ లీడర్లు ప్రస్తావించారని ఆరోపించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ‘కేరళలో కూడా మన లిక్కర్ కీర్తి పతాకం ఎగిరినట్టుంది. నాకు మలయాలం అర్థం కాదు.ఈ కేరళ నాయకుడు చెప్పేది మీకు ఎవరికైనా అర్థం అయితే చెప్పండి’అంటూ ఓ వీడియోను పోస్టు చేశారు.

కాగా,ఎమ్మెల్సీ కవిత పేరు తాజాగా కేరళ లిక్కర్ స్కామ్ కేసులో తెరపైకి రావడం రాజకీయంగా దుమారం రేపుతున్నది. కేరళలో ఒయాసిస్ కంపెనీకి లైసెన్స్ జారీ వెనుక కవిత పాత్ర ఉందని, ఆమె ఏకంగా కేరళ ప్రభుత్వ పెద్దలతో సంప్రదింపులు జరిపిందని ఆ రాష్ట్ర విపక్ష కాంగ్రెస్ నేత వీడీ సతీశన్ కేరళ అసెంబ్లీలో చేసిన ఆరోపణలు హాట్ టాపిక్‌గా మారాయి. కాగా, కవిత ఇటీవలే ఢిల్లీ లిక్కర్ స్కాంకేసులో బెయిల్ మీద బయట ఉన్న విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version