ఏడుపాయల వన దుర్గ మాతను మెదక్ జిల్లా ఎస్పీ పి.రోహిణి ప్రియదర్శిని శుక్రవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమెకు ఆలయ ఈఓ సార శ్రీనివాస్ పూర్ణకుంభంతో రాజ గోపురం వద్ద స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం తీర్థప్రసాదాలు అందజేసి ఆలయ మర్యాదలతో సత్కరించారు. రాబోయే మాఘ అమావాస్య పుణ్య స్నానాలు, మహాశివరాత్రి మహా జాతరకు లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు బందోబస్తు ఏర్పాట్ల గురించి అడిగి తెలుసుకున్నారు.