మహిళలకి గుడ్ న్యూస్. వాళ్ళ కోసం కొత్త ప్రిపెయిడ్ కార్డులు అందుబాటులోకి వచ్చాయి. అయితే పేమెంట్స్, రుణాలు, చెల్లింపులకు సంబంధించిన వంటి వాటి కోసం మహిళా ఎంట్రప్రెన్యూర్లకు రిలీఫ్ కలిగించడానికి మహిళా మనీ, వీసా, ట్రాన్స్‌కార్ప్ సంస్థలు కలిసి మహిళా మనీ ప్రిపెయిడ్ కార్డును తీసుకు వస్తున్నట్టు తెలుస్తోంది. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే..
ఈ కార్డులు వలన డిజిటల్ పేమెంట్లను బాగా చేయడానికి అవుతుంది. ఇక ఆల్ ఇండియా డెట్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ సర్వే చెప్పినది చూస్తే.. గ్రామీణ ప్రాంతాల్లో 80.7 శాతం మంది మహిళలకు, పట్టణ ప్రాంతాల్లో 81 శాతం మంది మహిళలకు బ్యాంక్ ఖాతాలున్నాయి. 55 శాతం మంది మహిళలు మాత్రం ఇంకా వారి బ్యాంక్ అకౌంట్లను యాక్టివ్‌గా ఉపయోగించడం లేదు.
పట్టణ ప్రాంతాల్లోని మహిళల్లో దాదాపు మూడింట రెండు వంతుల మంది డిజిటల్ చెల్లింపులను మహిళలు చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే మహిళా మనీ ప్రీపెయిడ్ కార్డ్ వలన చక్కటి లాభాలు పొందొచ్చు. బిజినెస్ కోసం డిజిటల్ పేమెంట్లను నేరుగా స్వీకరించొచ్చు. అలాగే వర్కింగ్ క్యాపిటల్ మెరుగు పరుచుకోడానికి కూడా అవుతుంది. లోన్స్ కోసం ఇది ఉపయోగ పడుతుంది.
క్యాష్ బ్యాక్, రివార్డ్స్ కూడా ఉంటాయి. అయితే ఈ మహిళా మనీ ప్రీపెయిడ్ కార్డ్ అనేది చిన్నదే అయినా కూడా మహిళలను బాగా ప్రోత్సహిస్తుంది. వీసాతో ఈ భాగస్వామ్యం కారణంగా మహిళా పారిశ్రామిక వేత్తల కోసం అత్యంత అనుకూలమైన ఫైనాన్షియల్ ఉత్పత్తులను రూపొందించడం అవుతుందన్నారు. దీనిలో డిజిటల్ కార్డు లేదా ఫిజికల్ కార్డు కూడా వున్నాయి.