అందమైన మరియు ఒత్తైన జుట్టు పొందడానికి స్త్రీలు ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. కొంతమంది ప్రతి వారం తప్పకుండా హెయిర్ ప్యాక్ వేసుకోవడం చేస్తారు, మరికొందరు విటమిన్ ఇ లేదా బయోటిన్ సప్లిమెంట్లను కూడా ఉపయోగిస్తారు. జుట్టును బలోపేతం చేయడానికి మరియు దాని పెరుగుదలను పెంచడానికి ఎన్నో ఉత్పత్తులు వాడినా అందరికీ ఫలితం రాదు. ఎందుకంటే జుట్టు పెరుగుదలకు అవసరమైన పోషకాలు వారిలో ఉండవు కనుక.
పాలకూర లోనే కాదు చిలకడదుంప లోనూ కూడా విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది. రోజుకు ఒక చిలకడదుంప తినడం వల్ల ఒక రోజుకు అవసరమైన విటమిన్ ఏ శరీరానికి లభిస్తుంది. జుట్టు రాలడానికి మరొక కారణం ఐరన్ లోపం. ఆహారం లో ఐరన్ సరిగ్గా తీసుకోవడం ఎంతో అవసరం. పాలకూర తో పాటు తోటకూర, రాగులు నువ్వులు వంటివి తీసుకుంటే ఐరన్ సమృద్ధిగా లభిస్తుంది.