ఘట్‌కేసర్‌ ఘటనలో రోజుకొక ట్విస్ట్‌..!

-

కాలజీ నుంచి ఆటోలో ఇంటికి వెలుతున్న ఓ ఫార్మసీ విద్యార్థినిపై ఘట్‌కేసర్‌ వద్ద అత్యాచారం జరిగినట్లు నమోదైన కేసులో రోజుకొక ట్విస్ట్‌ వెలుగులోకి వస్తుంది. నిందితులుగా అనుమానం వ్యక్తం చేస్తు అదుపులోకి తీసుకున్న ఆ నలుగురు ఆటో డ్రైవర్లతో సీన్‌ రీ–కన్‌స్ట్రక్షన్‌ చేసే క్రమంలో మరిన్ని ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. అసలు ఆ విద్యార్థి కిడ్నాప్‌కే గురి కానట్లు సీసీ కెమెరాల ద్వారా పోలీసులు నిర్ధారించారు.

కిడ్నాప్‌ అయినట్లు తల్లికి ఫోన్‌..

రాంపల్లి ఆర్‌ఎల్‌ నగర్‌కు చెందిన ఫార్మసీ విద్యార్థిని బుధవారం కాలజీ నుంచి ఇంటికొచ్చే క్రమంలో తనను కిడ్నాప్‌ చేసి ఆటోలో తీసుకెళ్తున్నారని తల్లికి ఫోన్లో చెప్పడంతో ఆమె డయల్‌100కు సమాచారం ఇచ్చింది. సెల్‌ఫోన్‌ సిగ్నల్‌ను గుర్తించిన పోలీసులు హుటాహుటిన అన్నోజీగూ ఔటర్‌రింగ్‌ రోడ్డు వద్ద ఆ అమ్మాయిని గుర్తించి ఆస్పత్రికి తరలించారు.

సీసీ కెమెరాల్లో ఒంటరిగానే..

కాసేటికి స్పృహలో వచ్చిన విద్యార్థిని ‘‘తనపై కొంతమంది ఆటో డ్రైవర్లు అత్యాచారానికి పాల్పడారు’’ అని పోలీసులకు చెప్పడంతో ఆ అనుమానంతో మరోసటి రోజు నలుగురు ఆటో డ్రైవర్లను స్టేషన్‌కు తరలించారు. ఆ విద్యార్థిని మాటలను రికార్డు చేసుకున్న పోలీసులు సీన్‌ రీ–కన్‌స్ట్రక్షన్‌ చేసే క్రమంలో సేకరిస్తున్న సమాచారానికి బాధితురాలు చెప్పే మాటలకు సింక్‌ కావడం లేదు. దీంతో మరోమారు సీసీ కెమెరాల ఫుటేజీను క్షుణ్నాంగా పరిశీలిస్తుండగా సదరు విద్యార్థిని 6 నుంచి 7.30 నిమిషాల మధ్య ఘట్‌కేసర్, యనంపేట, అన్నోజీగూడ ప్రాంతాల్లో తానొక్కతే తిరుగుతున్న దృశ్యాలు ఉండగా ఆ సమయంలో ఆటో డైవర్ల పోన్ల సిగ్నళ్లు ఆ ప్రాంతంలో లేనట్లు నిర్ధారించారు. అనుమానం వచ్చి మరోసారి ఆమె ప్రశ్నిస్తే రాత్రైనా ఇంటికి ఎందుకు రాలేదని తల్లి పలుమార్లు ఫోన్‌ చేయడతో ఆటో డ్రైవర్లు తనను ఎక్కడికెక్కడో తీసుకెళ్తున్నారని బాధితురాలు చెప్పినట్లు సమాచారం.

అక్కడికెలా వెళ్లింది..?

బాధితురాలిపై అత్యాచారం జరిగిందని డాక్టర్లు నిర్ధారించడంతో అన్నోజీగూడ ప్రాంతాల్లో మరోసారి పోలీసులు గాలించినా అత్యాచారం జరిగినట్లు ఎలాంటి ఆధారాలు లేవు. అత్యాచారం ఏ ప్రాంతంలో జరిగిందని పోలీసులు మరోసారి ప్రశ్నించగా సరైన సమా«ధానం చెప్పకపోవడంతో ఆమె మానసిక స్థితిపై ఆరా తీశారు. ఈ క్రమంలో ఇంతకు ముందు ఆమెతో సన్నిహితంగా ఉండే ఓ యువకుడిని అదుపులోకి తీసుకొని విచారించగా తనకు కూడా ఇలాగే ఓ సారి ఫోన్‌చేసి నన్ను కిడ్నాప్‌ చేశారని చెప్పడంతో దానిపై ఆరా తీయగా అబద్ధం అని తేలడంతో నాటి నుంచి దూరం పెట్టినట్లు యువకుడు తెలపడంతో పోలీసులు అవక్కయ్యారు. అయితే ఆ యువతి ఒంటరిగా ఆ ప్రాంతాల్లో ఎందుకు తిరిగింది..? వైద్యులేమో అత్యాచారం జరిగినట్లు నివేదిక ఇచ్చారు. అనే అంశాలపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version