ఆసియా కప్ 2023 తుది అంకానికి చేరుకుంది, మొత్తం ఆరు జట్లతో టోర్నమెంట్ స్టార్ట్ కాగా చివరికి ఇండియా , పాకిస్తాన్, బంగ్లాదేశ్ మరియు శ్రీలంకలు సూపర్ 4 కు చేరుకున్నాయి. ఇక సూపర్ 4 లో వరుసగా పాకిస్తాన్ మరియు శ్రీలంక జట్లను చిత్తు చేసి సగర్వంగా ఫైనల్ కు చేరుకుంది. ఇక ఫైనల్ లో మిగిలి ఉన్న మరొక్క బెర్త్ కోసం రెండు జట్లు పోటీ పడనున్నాయి. అందులో భాగంగా ఈ రోజు మధ్యాహ్నం కొలంబోలో శ్రీలంక మరియు పాకిస్తాన్ లు పోటీ పడనున్నాయి. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు ఫైనల్ కు చేరుకొని ఇండియాతో ఆసియా కప్ టైటిల్ కోసం పోరాడనున్నాయి. అయితే ఈ రెండు జట్లలో ఎవరు గెలుస్తారు అన్న ప్రశ్నకు క్రికెట్ విశ్లేషకులు తమ అభిప్రాయాన్ని తెలియచేశారు. ఈ మ్యాచ్ లో ఖచ్చితంగా శ్రీలంకనే ఫేవరెట్ అని చెబుతున్నారు. హోమ్ గ్రౌండ్ కావడం మరియు పాకిస్తాన్ కు కీలక బౌలర్లు హరీష్ రఫ్ మరియు నసీం షాలు గాయాలతో దూరం కావడం పెద్ద దెబ్బ అని చెప్పాలి.
ఇక బాబర్ ఆజం సైతం పెద్ద జట్లపై తగిన ప్రదర్శన చేయడంలో విఫలం అవుతున్నాడు. ఓపెనర్లు ఫఖార్ జమాన్ నుండి ఇనక ఆశించిన ఇన్నింగ్స్ చూసింది లేదు. అందుకే ఈ మ్యాచ్ లో శ్రీలంక గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.