చంద్రబాబు అరెస్టు రాజకీయ కక్షతోనే అని అర్థమవుతోంది: బండి సంజయ్‌

-

స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని అరెస్ట్‌ చేయడంపై బీజేపీ జాతీయ కార్యదర్శి బండి సంజయ్ మరోసారి స్పందించారు. చంద్రబాబు అరెస్ట్ రాజకీయ కక్ష తోనే అని అర్థం అవుతుందని వ్యాఖ్యానించారు. తప్పు చేస్తే, అరెస్ట్ చేయడాన్నీ ఎవరూ కాదనరని.. ఎవరూ తప్పు పట్టరని.. కానీ ఎఫ్​ఐఆర్​లో పేరు లేని వ్యక్తిని ఎందుకు అరెస్ట్ చేశారో అర్ధం కావడం లేదని బండి సంజయ్ అన్నారు.

చంద్రబాబును అరెస్ట్ చేయడం అక్రమమని ప్రజలు తిరగబడే పరిస్థితి వస్తోందని బండి సంజయ్ తెలిపారు. మాజీ ముఖ్య మంత్రిగా ఉన్న వ్యక్తిని అంత ఆదరాబాదరగా అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు. ఇలా అకస్మాత్తుగా అరెస్టు చేయడంతో చంద్రబాబుకు ప్రజల్లో మంచి మైలేజ్ వచ్చిందని బండి అన్నారు. ఏపీ వైసీపీ నేతలకు ఓ దురలవాటు ఉందని.. తప్పును తప్పు అంటే చంద్రబాబు ఏజెంట్ అంటారన్ని మండిపడ్డారు. జీ20 సమావేశాలు జరుగుతున్నప్పుడే అరెస్టుకు సమయం దొరికిందా అని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version