టీమిండియాకు షాక్.. శ్రీలంకతో జరిగే టి20 లకు కోహ్లీ, పంత్ దూరం !

-

టీమిండియా జట్టుకు ఊహించని షాక్ తగిలింది. వెస్టిండీస్ జట్టుతో రేపు జరిగే చివరి టి20 మ్యాచ్ కు టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తో పాటు రిషబ్ పంత్ దూరం కానున్నారు. అంతేకాదు శ్రీలంకతో జరిగే 3 t20 సిరీస్ కు కూడా వీరిద్దరూ దూరం అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. వీరిద్దరికి పది రోజుల పాటు విశ్రాంతి ఇవ్వాలని బిసిసిఐ నిర్ణయం తీసుకుంది.

దీంతో విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ లను బయో బబుల్ నుంచి బయటికి పంపారు. వచ్చే నెలలో శ్రీలంక తో టెస్టు మ్యాచ్లు ఉన్న నేపథ్యంలో బిసిసిఐ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే… టీమిండియా ఆడబోయే తర్వాతి నాలుగు టి20 మ్యాచ్ లకు వీరిద్దరూ దూరంగా ఉన్నారు.

ఇక ఈ 10 రోజుల విశ్రాంతి సమయంలో తమ కుటుంబంతో గడపనున్నారు ఈ ఇద్దరు కీలక ఆటగాళ్లు. కాగా వెస్టిండీస్ జట్టుతో జరుగుతున్న 3 t20 సిరీస్ ను టీమ్ ఇండియా జట్టు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version