ఒకవైపు కనురెప్ప మూసుకుపోతోందా? అయితే అది ఇదే కావొచ్చు

-

కొందరిలో ఒక వైపు కనురెప్ప వాలిపోవడం, ఒక వైపు భాగమంతా..అకస్మాత్తుగా జారిపోయినట్లుగా అనిపిస్తుంది..ఒకవైపు కండరాలు మెదడు నియంత్రణ తగ్గిపోవడంతో ఇలా జరుగుతూ ఉంటుంది. దీన్నే వాడుక భాషలో ‘ఫేషియల్‌ పెరాలసిస్‌’, వైద్య పరిభాషలో ‘బెల్స్‌పాల్సీ’ అంటారు. ఇది చాలా సాధారణంగా కనిపించే సమస్య.

మెదడు కింద ఉన్న వెన్నుపాము నుంచి 12 నరాలు బయటకు వస్తాయి. అలా పుర్రె భాగం నుంచి బయటకు వచ్చిన నాడులను ‘క్రేనియల్‌ నర్వ్స్‌’ అంటారు. ఇందులో ముఖం కండరాలను నియంత్రించే ‘ఏడవ నరం’ దెబ్బతినడం వల్ల ముఖంలోని ఒకవైపు భాగమంతా చచ్చుబడినట్లు అవుుతంది.. ముఖం వంకరగా కనపడుతుంది. నవ్వినప్పుడు, మాట్లాడినప్పుడు ఈ వంకరదనం ఎదుటివారికి స్పష్టంగా కనిపిస్తుంది.

లక్షణాలు

హెర్పిస్‌ సింప్లెక్స్‌ లాంటి ఏదైనా వైరల్‌ ఇన్ఫెక్షన్‌ వచ్చాక, దాని వల్ల ఉత్పన్నమైన యాంటీబాడీస్‌ ఫేషియల్‌ను దెబ్బతీసాయి. ఫలితంగా నరాలు వాస్తాయి. దాంతో అది నియంత్రించే భాగాలు చచ్చుబడిపోతాయి. ఫలితంగా మూతి, ముఖం వంకరపోవడం, ఆ వైపు కంట్లోంచి నీరు కారడం, నీళ్లు పుక్కిలిస్తున్నప్పుడు ఒకవైపు నుంచి సరిగా చేయలేకపోవడం, ఒకవైపు కనురెప్ప మూసుకుపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

చికిత్సలో భాగంగా అవసరాన్ని బట్టి డాక్టర్‌ల సూచన మేరకు యాంటీ వైరల్‌ మందులు, స్టెరాయిడ్స్‌ వాడతారు. మెరుగుదల అన్నది జబ్బు తీవ్రత మీద ఆధారపడి ఉంటుంది. తొంభైశాతం పైగా బాధితులు ఆరునెలల్లో పూర్తిగా కోలుకుంటారు.

అయితే ఇది కొందరిలో వంశపారపర్యంగా వస్తుందని అని కూడా అంటారు..ఇంకా ముడతలు వస్తున్నాయని చేసే ట్రీట్మెంట్ వల్ల కూడా ఈ వ్యాధి వస్తుందట. అందుకు సంబంధించిన ఒక ఉదాహరణను ఇప్పుడు చూద్దాం..

చైనాలోని హాంగ్‌జువో నగరానికి చెందిన 29 ఏళ్ల జాహ్వో ముఖం మీద చిన్న చిన్న ముడతలు ఉన్నాయి. అవి తన అందానికి అడ్డుగా ఉన్నాయని భావించిన ఆమె.. స్థానిక కాస్మోటిక్ హాస్పిటల్‌కు వెళ్లి చికిత్స చేయించుకుంది. ఆ ముడతలను తొలగించేందుకు ఫిల్లర్ ఇంజక్షన్లు చేయించుకుంది. అలా కొన్ని రోజులు ఫిల్లర్స్‌‌తో చికిత్స పొందింది. అయితే, రోజు ఆమెకు ఊహించని చేదు అనుభవం ఎదురైంది.

ఎప్పటిలాగానే ముఖానికి ఫిల్లర్ ఇంజక్షన్ చేయించుకున్న ఆమె.. వారం రోజుల తర్వాత ముఖంలో మార్పులు రావడం గమనించింది. ఆమె ముఖంలో ఎడమ వైపు భాగం పూర్తిగా కుచించుకుపోయి ముఖ పక్షవాతం ఏర్పడింది. ఉదయం నిద్రలేచే సమయానికి ఆమె మూతి పక్కకు వెళ్లిపోయింది. ఎడమ కంటితోపాటు నోటిని పూర్తిగా మూయలేకపోయింది. దీంతో ఆహారం కూడా నమల లేక ఇబ్బంది పడుతోంది. కేవలం ద్రవ పదార్థాలను మాత్రమే తీసుకుంటోంది.

నిపుణులు తెలిపిన సమాచారం ప్రకారం.. ఆమెకు ముఖం సాధారణ స్థితికి చేరడానికి నెలలు లేదా సంవత్సరాలు పట్టవచ్చని లేదా శాస్వతంగా అలాగే ఉండిపోవచ్చని అంటున్నారు. చూశారా.. అందంగా ఉండాలనే తపన ఆమెకు ఎన్ని కష్టాలు తెచ్చిపెట్టింది. కాబట్టి.. సున్నితమైన ముఖానికి ఏదైనా చికిత్స చేయించుకొనే ముందు తప్పకుండా నిపుణులను సంప్రదించాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version