ఇంగ్లాండ్ తో నాలుగో టెస్ట్ మొదటి రోజు ఆటలో భారత స్టార్ బ్యాటర్ గాయంతో రిటైర్డ్ హార్ట్ గా వెనుతిరిగిన సంగతి తెలిసిందే. దీనిపై యంగ్ ప్లేయర్ సాయి సుదర్శన్ రియాక్ట్ అయ్యారు. ‘రిషబ్ పంత్ చాలా నొప్పితో ఉన్నాడు. స్కాన్ కోసం ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఇవాళ గాయం తీవ్రతపై క్లారిటీ వస్తుంది. ఒకవేళ తిరిగి రాకపోతే అతడి సేవలను కోల్పోతాం. అది తీవ్ర ప్రభావం చూపుతుంది.

ఆ కష్టాన్ని కవర్ చేసేందుకు మరింతగా కష్టపడతాం’ అంటూ సుదర్శన్ అన్నారు. దీంతో సుదర్శన్ చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. కాగా రిషబ్ పంత్ కు కనీసం 6 వారల రెస్ట్ అవసరమని అంటున్నారు. దింతో రిషబ్ పంత్ ఇండియాకు వచ్చే ఛాన్స్ ఉందట.