చెన్నై సూపర్ కింగ్స్ హ్యాట్రిక్ ఓటమిని మూటగట్టుకుంది. ఆ జట్టు పై ఢిల్లీ 25 పరుగుల తేడా విజయం సాధించింది. వరుసగా 3 గెలుపులతో పాయింట్ల పట్టికలో టాప్ కు చేరుకుంది. 184 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన CSK 158/5 స్కోర్ మాత్రమే చేసింది. రచిన్ రవీంద్ర 3, కాన్వే 13, రుతురాజ్ 5, విజయ్ శంకర్ 69, దూబె 18, జడేజా2, ధోని, 30, పరుగులు చేశారు. విప్రాజ్ 2, స్టార్క్, ముకేష్, కుల్దీప్ తలో వికెట్ తీశారు.
ఢిల్లీ జట్టులో కే.ఎల్. రాహుల్ 77 కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అభిషేక్ పోరెల్ 33, అక్సర్ పటేల్ 21, సమీర్ రిజ్వి 20, స్టబ్స్ 24 రన్స్ చేశారు. ఈ మ్యాచ్ లో ఢిల్లీ విజయం సాధించి అందరి మన్ననలు పొందింది.