న్యూజిలాండ్ భారత్ ల మధ్య జరుగుతన్న రెండో టీ ట్వంటి మ్యాచ్ లో టాస్ ఓడి న్యూజిలాండ్ మొదట బ్యాటింగ్ చేసింది. కివిస్ బ్యాటర్లు అద్భుతంగా రాణించడం తో న్యూజిలాండ్ 153 స్కోర్ చేయకలిగింది. మొదట న్యూజిలాండ్ ఓపెనర్లు శుభారంభం ఇవ్వడం తో న్యూజిలాండ్ మంచి స్కోర్ చేసింది. మార్టిన్ గప్టిల్ కేవలం 15 బంతులలో 3 ఫోర్లు, 2 సిక్స్ లతో 31 పరుగుల చేశాడు. అలాగే డారిల్ మిచెల్ 31 (28) కూడా రాణించారు. తర్వాత గ్లేన్ ఫీలిప్స్ 34 (21) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.
టీమిండియా బౌలర్లు కూడా అద్భుతంగా రాణించారు. అంతర్జాతీయ టీ 20 లకు అరంగేట్రం చేసిన హర్షల్ పటేల్ 2 వికెట్లు తీశాడు. అలాగే భూవనేశ్వర్ కుమార్, అక్షర్ పటేల్, దిపక్ చాహర్, రవిచంద్రన్ అశ్విన్ తల ఒక వికెట్ తీశారు. దీంతో న్యూజిలాండ్ 6 వికెట్లు కొల్పోయి 153 పరుగులు చేసింది. దీంతో టీమిండియా ముందు లక్ష్యాన్ని ఉంచింది. అయితే టీమిండియా ఓపెనర్లు రోహిత్ , కెఎల్ రాహుల్ విజృంభిస్తే గెలిచే అవకాశాలు ఉన్నాయి. అలాగే మిడిల్ ఆర్డర్ కూడా మంచి ప్రదర్శన ఇవ్వాల్సి ఉంటుంది.