IND vs WI : క్లీన్ స్వీప్ వైపే అడుగులు.. నేడు రెండో టీ20

-

వెస్టిండీస్ తో టీమిండియా టీ 20 సిరీస్ ఆడుతున్న విషయం తెలిసిందే. ఇప్ప‌టికే ఆడిన తొలి టీ 20 మ్యాచ్ లో టీమిండియా ఘ‌న విజ‌యం సాధించి మూడు మ్యాచ్ ల సిరీస్ లో 1-0 తేడాతో ముందు ఉంది. కాగ ఈ టీ 20 సిరీస్ ను క్లీన్ స్వీప్ చేయాల‌ని రోహిత్ సేన ఆరాట‌ప‌డుతుంది. భార‌త ఓపెనర్లు, మిడిల్ ఆర్డ‌ర్లు, బౌలింగ్ విభాగం ప‌టిష్టంగా ఉండ‌టంతో వ‌రుస విజ‌యాల‌ను న‌మోదు చేస్తుంది. మాజీ కెప్టెన్ కోహ్లి మిన‌హా దాదాపు అంద‌రూ కూడా మంచి ఫామ్ లోనే ఉన్నారు.

వెస్టిండీస్ తో ఇప్ప‌టికే జ‌రిగిన మూడు వ‌న్డేల సిరీస్ ను రోహిత్ సేన క్లీన్ స్వీప్ చేసింది. తాజా గా టీ 20 సిరీస్ పై కూడా టీమిండియా క‌న్ను వేసింది. ఆల్ రౌండ్ ప్ర‌ద‌ర్శ‌న చేస్తున్న టీమిండియా.. వెస్టిండీస్ ను క్లీన్ స్వీప్ చేయాల‌నే ల‌క్ష్యంతోనే అడుగులు వేస్తుంది. కాగ తొలి టీ 20 మ్యాచ్ లో ఆల్ రౌండ‌ర్లు వెంక‌టేశ్ అయ్యార్, దీప‌క్ చాహ‌ర్ లకు గాయం అయింది. కాగ వీరు నేటి రెండో టీ 20 దూరం అయ్యే అవ‌కాశాలు ఉన్నాయి.

గాయం త‌గ్గ‌క పోవ‌డం లేదా.. గాయం కార‌ణంగా ఈ ఇద్ద‌రి కి విశ్రాంతి ఇచ్చే అవ‌కాశాలు ఉన్నాయ‌ని తెలుస్తుంది. కాగ వీరు నేటి మ్యాచ్ కు ఆడ‌క‌పోతే.. మ‌రో ఇద్ద‌రు కొత్త ప్లేయ‌ర్లు రావ‌డం ఖాయం. కాగ భూవ‌నేశ్వ‌ర్ కుమార్ తో పాటు మరోక్క‌రికి ఛాన్స్ ఇచ్చే సూచ‌న‌లు ఉన్నాయి. కాగ నేటి మ్యాచ్ ఈ రాత్రి 7 గంట‌ల‌కు ప్రారంభం కానుంది. ఈడెన్ గార్డెన్ లో జ‌రిగే ఈ మ్యాచ్.. బౌలింగ్ కు అనుకూలించే అవ‌కాశాలు ఉన్నాయి. కాగ మొద‌ట టాస్ నెగ్గిన జ‌ట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకునే అవ‌కాశాలు ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version