హైదరాబాద్‌తో మ్యాచ్‌లో గుజరాత్ స్పెషల్‌ జెర్సీ.. ఇదే కారణం

-

అరంగేట్రంలోనే ఐపీఎల్ ఛాంపియన్​గా అవతరించిన గుజరాత్ టైటాన్స్ ఈ సీజన్​లోనూ దుమ్మురేపుతోంది. ఈ సీజన్​లో ప్లే ఆఫ్స్ చేరిన తొలిజట్టుగా నిలిచిన జీటీ టీమ్ గత రాత్రి సొంత మైదానంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుత విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే, ఈ మ్యాచ్‌లో గుజరాత్ జట్టు ఎప్పటిలా ముదురు నీలం రంగు కాకుండా లావెండర్ (ఊదా రంగు) కలర్‌ జెర్సీలో కన్పించింది. దీని వెనుక ఓ గొప్ప కారణం ఉంది. అదేంటంటే..?

‘‘ప్రతి ఒక్కరి ఆరోగ్యం, శ్రేయస్సు పట్ల గుజరాత్‌ టైటాన్స్ ఆరాటపడుతుంది. క్యాన్సర్‌ బాధితులకు అండగా ఉండేందుకు, ఆ వ్యాధిపై అందరికీ అవగాహన కల్పించేందుకు మా వంతు ప్రయత్నం ఇది’’ అని టైటాన్స్‌ జట్టు ట్విటర్‌లో వెల్లడించింది.

‘‘మన దేశంలోనే గాక, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది క్యాన్సర్‌ తో పోరాడుతున్నారు. ఈ ప్రాణాంతక వ్యాధిపై అవగాహన కల్పించడం మా బాధ్యతగా భావించాం. క్యాన్సర్‌ బాధితులకు అండగా నిలిచేందుకే మేం లావెండర్ జెర్సీ వేసుకున్నాం. ఈ చర్య ఇతరుల్లో స్ఫూర్తి నింపుతుందని మేం విశ్వసిస్తున్నాం’’ అని ఈ టీమ్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా తెలిపాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version