ఐపీఎల్ 2022 లో కీలకమైన మ్యాచ్ లో ఆర్సీబీ చిత్తుగా ఓడింది. పంజాబ్ నిర్దేశించిన 210 పరుగుల లక్ష్య ఛేదనలో ఆర్సీబీ 9 వికెట్ల నష్టానికి 155 పరుగులే చేయగలిగింది. దీంతో ఆర్సీబీ పై పంజాబ్ 54 పరుగుల తేడాతో విజయం సాధించి ప్లేఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. బెంగళూరు బ్యాటర్లలో గ్లెన్ మ్యాక్స్ వెల్ 35, రాజత్ పాటిదార్ 26 పరుగులు, కోహ్లీ 20 పరుగులు చేసి.. పర్వాలేదనిపించారు. కానీ.. చివరికి పంజాబ్ 54 పరుగుల తేడాతో విజయం సాధించింది.
అయితే.. ఈ మ్యాచ్ లో ఓ అరుదైన సంఘటన చోటు చేసుకుంది. ఈ మ్యాచ్ లో నల్ల పిల్లి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది. దీనివల్ల ఆర్సీబీ బ్యాటింగ్ ను కాసేపటి దాకా ఆపేశారు. ఆర్సీబీ కెప్టెన్ బ్యాటింగ్ చేస్తుండగా.. తెల్లటి మచ్చలతో ఉన్న నల్ల పిల్లి సైట్ స్క్రీన్ పై హాయిగా కూర్చుని ఉంది. అయితే.. కొంత సేపటి తరువాత అక్కడి నుంచి అది వెళ్లిపోయింది. ఇదంతా చూసిన డుప్లెసిస్..నవ్వుకున్నాడు. కానీ తర్వాత ఆర్సీబీ ప్లేయర్లు వరుసగా అవుటయ్యారు. అయితే.. దీనికి ఆ నల్లపిల్లే కారణమని.. నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
— Varma Fan (@VarmaFan1) May 13, 2022