IPL 2022 : హైదరాబాద్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ అరుదైన రికార్డు

-

కేకేఆర్‌ తో నిన్న జరిగిన మ్యాచ్‌ లో హైదరాబాద్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ ఓ అరుదైన రికార్డును సాధించాడు. ఈ మ్యాచ్‌ లో 17 రన్స్‌ చేసిన విలియమ్సన్‌ ఈ క్రమంలోనే ఐపీఎల్‌ లో 2 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. తద్వారా ఐపీఎల్‌ లో సన్‌ రైజర్స్‌ తరఫున 2 వేల పరుగులను పూర్తి చేసిన మూడో ఆటగాడిగా నిలిచాడు. విలియమ్సన్‌ కంటే ముందు వార్నర్‌, ధావన్‌ కూడా హైదరాబాద్‌ తరఫున 2 వేల పరుగులు చేశారు.

కాగా.. నిన్నటిమ్యాచ్‌ తో.. సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ హ్యట్రిక్‌ విజయాన్ని నమోదు చేసుకుంది. త్రిపాఠి, మాక్రమ్‌ హాఫ్‌ సెంచరీలతో దుమ్ము లేపడంతో.. కేకేఆర్‌ పై హైదరాబాద్‌ 7 వికెట్ల తేడాతో గ్రాండ్‌ విక్టరీ కొట్టింది. త్రిపాఠి 71, మాక్రమ్‌ 68 దూకుడుతో మరో 13 బంతులు మిగిలి ఉండగానే హైదరాబాద్‌ విజయం సాధించింది. వరుసగా రెండు సిక్సులు కొట్టి.. మాక్రమ్‌ జట్టును గెలిపించేశాడు. ఈ సీజన్‌ లో హైదరాబాద్‌ కు ఇది హ్యాట్రిక్‌ విజయం.

మొదటి రెండు మ్యాచ్‌ లు ఓడిన హైదరాబాద్‌ ఆ తర్వాత వరుసగా 3 మ్యాచ్‌ లు గెలిచింది. అంతకు ముందు నితీష్‌ రానా 54, అండ్రూ రస్సెల్‌ 49 పరుగులతో.. చెలరేగడంతో.. కోల్‌ కతా నైట్‌ రైడర్స్‌ 175 పరుగులు చేసింది. 176 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి హైదరాబాద్‌ కు ఆరంభంలోనే ఎదురు దెబ్బ తగిలింది. ఓపెనర్లు అభిషేక్‌ శర్మ 3 పరుగులు, కేన్‌ విలియమ్సన్‌ 17 పరుగులు చేసి.. ఔట్‌ అయ్యారు. ఈ నేపథ్యంలో.. క్రీజులోకి వచ్చిన త్రిపాఠి 71, మాక్రమ్‌ 68 దూకుడుతో.. జట్టుకు విజయాన్ని అందించారు.

 

 

 

 

 

 

 

 

 

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version