ఇండియన్ ప్రిమియర్ లీగ్ (ఐపీఎల్-2024) 17వ సీజన్‌లో ఆఖరి ఘట్టానికి రంగం సిద్ధమైంది. లీగ్‌లో ఉత్తమ ప్రదర్శన చేసిన రెండు జట్ల మధ్య టైటిల్ పోరు ఈరోజు జరగనుంది. లీగ్ దశను తొలి రెండు స్థానాలతో ముగించిన కోల్‌కతా నైట్‌రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్.. చెన్నైలో కప్పు కోసం ఇవాళ ఫైట్ చేయబోతున్నాయి. 2012, 2014లో టైటిల్ సాధించిన కోల్‌కతా మూడో కప్పు కోసం ఉవ్విళ్లూరుతుండగా.. 2016లో తొలిసారి ఛాంపియన్ అయ్యాక మళ్లీ కప్పు గెలవని సన్‌రైజర్స్ ఈసారి అవకాశాన్ని వదులుకోకూడదని ఫిక్స్ అయింది. ఐపీఎల్‌లో కోల్‌కతా, సన్‌రైజర్స్‌కు ఫైనల్ చేరడం ఇది నాలుగోసారి.
ఈ సీజన్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లే ఫైనల్లో తలపడుతుండడాన్ని బట్టి ఫేవరెట్ ఎవరని స్పష్టంగా చెప్పలేని పరిస్థితి. అయితే బ్యాటింగ్‌లో సన్‌రైజర్స్‌దే కొంత పైచేయి. మరోవైపు ఐపీఎల్-17 ఫైనల్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది. చెన్నైలో ఆదివారం రాత్రి జల్లులతో కూడిన వర్షం పడొచ్చని అంచనా. అయితే మ్యాచ్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే ప్రమాదం అయితే లేదు. ఒకవేళ అలా జరిగినా సోమవారం రిజర్వ్ డే ఉంది కాబట్టి ఇబ్బంది లేదు.