IPL KKR vs RR : టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కోల్‌క‌త్త‌

-

ఐపీఎల్ 2022 లో భాగంగా ఈ రోజు కోల్ క‌త్త నైట్ రైడ‌ర్స్, రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జట్ల మ‌ధ్య 30వ మ్యాచ్ జ‌రుగుతుంది. ఈ మ్యాచ్ లో కీల‌క‌మైన టాస్ ను కోల్ క‌త్త నైట్ రైడ‌ర్స్ జ‌ట్టు గెలిచింది. దీంతో కెప్టెన్ శ్రేయ‌ష్ అయ్యార్ ముందుగా బౌలింగ్ చేయాల‌ని నిర్ణ‌యం తీసుకున్నాడు. సంజు శాంస‌న్ నేతృత్వంలోని రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్టు తొలుత బ్యాటింగ్ చేయ‌నుంది. ఈ రెండు జ‌ట్లు పాయింట్ల ప‌ట్టిక‌లో స‌మానంగా ఆరు పాయింట్ల‌తో ఉన్నాయి.

కాగ రాజ‌స్థాన్ 5 మ్యాచ్ లు మాత్ర‌మే ఆడ‌గా.. కోల్‌క‌త్త 6 మ్యాచ్ లు ఆడింది. ఈ మ్యాచ్ లో గెలిచ‌న జ‌ట్టు 8 పాయింట్ల‌తో టాప్ సెకండ్ ప్లేస్ కు వెళ్లే అవ‌కాశం ఉంటుంది. కాగ ఈ మ్యాచ్ కొసం ఇరు తుది జ‌ట్లు ఇలా ఉన్నాయి.

రాజస్థాన్ రాయల్స్ తుది జ‌ట్టు :
జోస్ బట్లర్, దేవదత్ పడిక్కల్, సంజు శాంసన్ (కెప్టెన్ / వికెట్ కీప‌ర్ ), కరుణ్ నాయర్, షిమ్రాన్ హెట్మెయర్, రియాన్ పరాగ్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, ప్రసిద్ధ్ కృష్ణ, ఒబెడ్ మెక్‌కాయ్, యుజ్వేంద్ర చాహల్

కోల్‌కతా నైట్ రైడర్స్ తుది జ‌ట్టు :
వెంకటేష్ అయ్యర్, ఆరోన్ ఫించ్, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), నితీష్ రాణా, ఆండ్రీ రస్సెల్, షెల్డన్ జాక్సన్ (వికెట్ కీప‌ర్), సునీల్ నరైన్, పాట్ కమిన్స్, శివం మావి, ఉమేష్ యాదవ్, వరుణ్ చకరవర్తి

Read more RELATED
Recommended to you

Exit mobile version