IPL : ఢిల్లీ క్యాపిట‌ల్‌కు భారీ ఊర‌ట‌.. మిచెల్ మార్ష్‌కు క‌రోనా నెగిటివ్

-

ఐపీఎల్ 2022లో క‌రోనా కేసు న‌మోదు కావ‌డం తీవ్ర‌ క‌లక‌లం సృష్టించింది. ఢిల్లీ క్యాపిట‌ల్స్ జ‌ట్టు ఫిజియో కరోనా బారీన ప‌డ్డాడు. దీంతో దీంతో ఐపీఎల్ సీజ‌న్ పై తీవ్ర ప్ర‌భావం చూపే అవ‌కాశాలు ఉన్నాయ‌ని అనుకున్నారు. ఈ రోజు ఉద‌యం కూడా ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయ‌ర్ మిచెల్ మార్స్ కు క‌రోనా వైర‌స్ పాజిటివ్ గా నిర్ధారణ అయింద‌ని వార్త‌లు వ‌చ్చాయి. కాగ దీని పై ఢిల్లీ క్యాప‌టిల్స్ యాజ‌మాన్యం వివ‌ర‌ణ ఇచ్చింది. మిచెల్ మార్ష్ కు మొద‌ట యాంటిజెన్ ప‌రీక్షలో పాజిటివ్ వ‌చ్చింద‌ని ప్ర‌క‌టించారు.

అయితే వెంట‌నే మిచెల్ మార్స్ ను ఐసోలేషన్ కు త‌ర‌లించామ‌ని తెలిపారు. అయితే ఐసోలేషన్ లో ఆర్‌టీపీసీఆర్ ప‌రీక్ష చేయ‌గా.. నెగెటివ్ వ‌చ్చిన‌ట్టు వెల్ల‌డించారు. అలాగే త‌మ జ‌ట్టు ఫిజియో కు కూడా ఆర్టీపీసీఆర్ ప‌రీక్షలో నెగెటివ్ వ‌చ్చింద‌ని ప్ర‌క‌టించారు. కాగ ఢిల్లీ క‌రోనా వైర‌స్ నుంచి బ‌య‌ట ప‌డ‌టంతో బుధ‌వారం పంజాబ్ కింగ్స్ తో జ‌ర‌గ‌బోయే మ్యాచ్ యాథ‌విధిగా కొన‌సాగుతుంద‌ని ఐపీఎల్ నిర్వ‌హ‌కులు వెల్ల‌డించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version