ఐపీఎల్ 2024లో భాగంగా ఇవాళ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య 10వ మ్యాచ్ జరుగుతోంది. కోల్ కతా తొలుత టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విరాట్ కోహ్లీ (83) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడటంతో 182 పరుగులు చేసింది. ఓపెనర్ డూప్లెసిస్ ఈ మ్యాచ్ లో కూడా అంతగా రాణించలేదు. కేమరూన్ గ్రీన్ (33) పరుగులు చేసి కాస్త పర్వాలేదనిపించాడు. మ్యాక్స్ వెల్ రెండు లైఫ్ లు వచ్చినప్పటికీ మూడో సారి ఔట్ అయ్యాడు.
ఇక 19 బంతుల్లో 28 పరుగులు చేశాడు మ్యాక్స్ వెల్. మిగతా బ్యాటర్స్ సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు. చివర్లో వచ్చిన దినేష్ కార్తీక్ 20 పరుగులు చేశాడు. దీంతో 20 ఓవర్లకు 182/6 పరుగులు చేసింది ఆర్సీబీ. కోల్ కతా నైట్ రైడర్స్ టార్గెట్ 183 పరుగులు. ఛేదిస్తుందో లేదో చూడాలి మరీ.