ఐసీసీ ర్యాంకింగ్స్‌లో మెరుగైన స్థానంలో కెఎల్ రాహుల్

-

ఐసీసీ తాజా గా ర్యాంకింగ్స్ ల‌ను విడుద‌ల చేసింది. టీ 20 ర్యాంకింగ్స్ ల‌లో టీమిండియా ఓపెన‌ర్ కెఎల్ రాహుల్ మెరుగైన స్థానంలో నిలిచాడు. 20 ర్యాంకింగ్స్ లో 4వ స్థానంలో 729 పాయింట్ల‌ల‌తో కెఎల్ రాహుల్ నిలిచాడు. అలాగే మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ 10 వ స్థానంలో నిలిచాడు. అలాగే 11వ స్థానంలో ప్ర‌స్తుత కెప్టెన్ రోహిత్ శ‌ర్మ కొన‌సాగుతున్నాడు. బ్యాటింగ్ విభాగంలో ముగ్గురు టీమిండియా ప్లేయ‌ర్లు ఉన్నారు.

కానీ బౌలింగ్ లో విభాగంలో టాప్ -10 లో భార‌త్ నుంచి క‌నీసం ఒక్క‌రు కూడా లేరు. భార‌త్ నుంచి భువ‌నేశ్వ‌ర్ 20 వ స్థానంలో కోన‌సాగుతున్నాడు. అలాగే బూమ్రా 26 వ స్థానంలో కొన‌సాగుతున్నాడు. అలాగే ఆల్ రౌండ‌ర్ల జాబితాలో కూడా టీమిండియా నుంచి టాప్ – 10 ఒక్క ప్లేయ‌ర్ కూడా లేడు. టీ 20 ర్యాంగింక్స్ లో మొద‌టి స్థానంలో పాకిస్థాన్ ప్లేయ‌ర్ బాబ‌ర్ ఆజ‌మ్ 805 పాయింట్ల తో ఉన్నాడు. అలాగే రెండో స్థానంలో మ‌రో పాక్ ఆట‌గాడు రిజ్వాన్ 798 పాయింట్ల ఉన్నాడు. మూడో స్థానంలో సౌత్ ఆఫ్రికా ఆట‌గాడు మార్క్రామ్ ఉన్నాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version