ఇంగ్లండ్‌తో భారత్ ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో రెండో టెస్టును ఆడుతున్న విషయం విదితమే. కాగా రెండో టెస్టులో మొదటి రోజు భారత్ ఇంగ్లాండ్‌పై ఆధిపత్యం చెలాయించింది. భారత్ మొదట బ్యాటింగ్ చేసి మొదటి రోజు ముగిసే సమయానికి 276/3 స్కోరు వద్ద నిలిచింది. కేఎల్ రాహుల్ క్లాస్ సెంచరీతో ఆకట్టుకోగా, రోహిత్ శర్మ 145 బంతుల్లో 83 పరుగులు చేయడం ద్వారా టాప్ ఆర్డర్లో కీలక పాత్ర పోషించాడు. దీంతో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ లార్డ్స్ టెస్టులో పైచేయి సాధించింది.
హిట్ మాన్ రోహిత్ శర్మ ఇంగ్లాండ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ప్రత్యర్థి జట్టుపై ఆధిపత్యం చెలాయించడానికి పోరాటం చేశాడు. ఈ క్రమంలో శర్మ తన ఇన్నింగ్స్ లో 11 ఫోర్లు, 1 సిక్సర్ ను సాధించాడు. కేఎల్ రాహుల్‌తో కలిసి 126 పరుగుల ఓపెనింగ్ స్టాండ్‌లో శర్మ పాలుపంచుకున్నాడు., లార్డ్స్ క్రికెట్ మైదానంలో భారత జట్టు భారీ స్కోరు చేసే అవకాశాన్ని కల్పించాడు. రోహిత్ శర్మతో పాటు, భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా జట్టుకి 42 కీలక పరుగులు అందించాడు. రాహుల్‌తో కలిసి 117 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.
ఇక పేస్ బౌలింగ్ లెజెండ్ జేమ్స్ ఆండర్సన్ 2 వికెట్లు పొందాడు. ఆండర్సన్ తో పాటు ఒల్లీ రాబిన్సన్ కూడా ఒక వికెట్ తీశాడు. నాటింగ్‌హామ్‌లో జరిగిన తొలి టెస్టు మ్యాచ్ డ్రాగా ముగియడంతో భారత్, ఇంగ్లాండ్ మధ్య టెస్ట్ సిరీస్ ప్రస్తుతం 0-0తో సమంగా ఉంది.
Rohit Sharma with another gem in press conference 😂👏👌
Video: BCCI#ENGvIND pic.twitter.com/v7rw0CIEBk
— Subhayan Chakraborty (@CricSubhayan) August 13, 2021
అయితే తొలి రోజు ఆట ముగిసిన అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రోహిత్ శర్మ పాల్గొన్నాడు. ఈ సందర్బంగా ఒక జర్నలిస్టు రోహిత్ శర్మను ఒక ప్రశ్న అడిగాడు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ మ్యాచ్ లో భారత్ విజయం సాధిస్తే బాగుంటుంది కదా.. అప్పుడు ఆగస్టు 15తోపాటు ఆ వేడుకలను కూడా జరుపుకోవచ్చు.. అని అడగ్గా.. అందుకు రోహిత్ శర్మ అద్భుతమైన సమాధానం ఇచ్చాడు. ఆ జర్నలిస్టుకు రోహిత్ శర్మ శాల్యూట్ చేశాడు. అలా జరిగితే సంతోషమే కదా.. అని అన్నాడు.
కాగా రోహిత్ శర్మ అలా సమాధానం ఇచ్చిన ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు రోహిత్ శర్మను ప్రశంసిస్తున్నారు.