అశ్విన్ సెంచరీ చేస్తే హీరో అయిన సిరాజ్… గ్రౌండ్ లో ఏం జరిగింది…?

-

మహ్మద్ సిరాజ్… ఖచ్చితంగా అంతర్జాతీయ క్రికెటర్లలో ఈ పేరు సంచలనం అవుతుంది అంటున్నారు క్రీడా పండితులు. అతను అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగు పెట్టిన తర్వాత ఆసిస్ పర్యటన నుంచి హాట్ టాపిక్ అయ్యాడు. తండ్రి మరణించినా సరే ఆ సీరీస్ లో అతను బాగా రాణించాడు. ఇండియా రావడానికి అంగీకరించలేదు. ఇక ఇప్పుడు ఇంగ్లాండ్ తో జరుగుతున్న సీరీస్ లో కూడా అతను సత్తా చాటుతున్నాడు.

క్లిష్ట పరిస్థితిలో అశ్విన్ నిలబడి సెంచరీ చేసాడు. సిరాజ్ క్రీజ్ లో ఉన్నప్పుడు అశ్విన్ ఫర్ తో కలిసి సెంచరీ చేసాడు. సిరాజ్ అశ్విన్‌తో 9.1 ఓవర్ల పాటు నిలిచాడు. అజేయంగా 16 పరుగులు చేసాడు. సిక్సులు కూడా గట్టిగానే కొట్టాడు. అయితే అశ్విన్ సెంచరీ చేసిన సమయంలో… పరుగు తీస్తున్నాడు. అప్పుడు సిరాజ్ కూడా గాలిలో యెగిరి సంబురం చేసుకున్నాడు. సిరాజ్ ఆనందంతో గాలిని పంచ్ విసరడం మరియు తన భాగస్వామి విజయాన్ని జరుపుకోవడం కనిపించింది.

ఈ వీడియో కి సోషల్ మీడియాలో చాలా మంచి స్పందన వచ్చింది. ఇక ఈ మ్యాచ్ లో టీం ఇండియా విజయానికి మరో 7 వికెట్లు అవసరం. మరో రెండు రోజుల పాటు ఆట ఉండటం ఏడు వికెట్లు మాత్రమే ఉండటం… పిచ్ స్పిన్ కి అనుకూలంగా ఉండటంతో భారత జట్టు విజయం లాంచనం అయింది అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version