T-20 World cup : టాస్ గెలిచిన న్యూజిలాండ్ ! మొద‌టి బ్యాటింగ్ ఇంగ్లాండ్

-

టీ ట్వంటి ప్ర‌పంచ క‌ప్ తుది ద‌శ కు చేరుకుంది. ఈ రోజు న్యూజిలాండ్ , ఇంగ్లాండ్ దేశాల మ‌ధ్య మొద‌టి సెమీ ఫైన‌ల్ మ్యాచ్ జ‌ర‌గుతుంది. ఈ మ్యాచ్ లో న్యూజి లాండ్ కెప్టెన్ కేన్ విలియ‌మ్ స‌న్ టాస్ గెలిచి బౌలింగ్ ను ఎంచు కున్నాడు. దీంతో ఇంగ్లాండ్ జ‌ట్టు మొద‌ట బ్యాటింగ్ చేయ‌నుంది. అయితే ఈ మ్యాచ్ లో కూడా టాస్ కీల‌కం గా మార‌నుంది.

ఇప్ప‌టి వ‌ర‌కు టాస్ గెలిచిన వారు బౌలింగ్ నే ఎంచు కున్నారు. మొద‌ట బ్యాటింగ్ చేసిన వారికి బౌలింగ్ నుంచి ఇబ్బందులు ఎదురు అవుతాయి. టాస్ గెలిచిన వారే దాదాపు మ్యాచ్ కూడా గెలిచే అవ‌కాశం ఉంటుంది. కాగ ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ జ‌ట్టు హాట్ ఫేవ‌రేట్ గా బ‌రి లోకి దిగుతుంది.

న్యూజిలాండ్ తుది జ‌ట్టు : కేన్ విలియ‌మ్ స‌న్ (కెప్టెన్ ), మార్టిన్ గ‌ఫ్టిల్, డారిల్ మిచెల్, డేవానం కాన్వే ( వికెట్ కీప‌ర్‌) గ్లెన్ ఫిలిప్స్, జేమ్స్ నీష‌మ్, మిచెల్ సాంట‌ర్న్, ఆడమ్ మిల్నే, టీమ్ సౌతీ, ఇష్ సోధీ, ట్రెంట్ బౌల్ట్.

ఇంగ్లాండ్ తుది జ‌ట్టు : ఈయాన్ మోర్గ‌న్ (కెప్టెన్) జోస్ బ‌ట్ల‌ర్ (వికెట్ కీప‌ర్‌) జానీ బెయిర్ స్టో, డేవిడ్ మ‌ల‌న్, మొయిన్ అలీ, సామ్ బిల్లింగ్స్, లియామ్ లివింగ్ స్టోన్ , క్రిస్ వోక్స్, క్రిస్ జోర్డాన్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్.

Read more RELATED
Recommended to you

Exit mobile version