ఇండియా బ్రేకుల్లేని రైలులా దూసుకెళుతోంది: వసీం అక్రమ్

-

ప్రస్తుతం ఇండియా వేదికగా వరల్డ్ కప్ 2023 జరుగుతున్న విషయం తెలిసిందే. అనుకున్న విధంగానే ఇండియా ఫేవరెట్ గా దూసుకువెళుతోంది. ఇప్పటి వరకు ఇండియా ఆడిన అయిదు మ్యాచ్ లలో విజయాన్ని అందుకుని టైటిల్ ను సాధించే దిశగా వెళుతోంది. ఇక తాజాగా పాకిస్తాన్ మాజీ ఆటగాడు వసీం అక్రమ్ మాట్లాడుతూ ఇండియా పై కీలక వ్యాఖ్యలు చేశారు. న్యూజిలాండ్ పై ఇండియా సాధించిన విజయం పట్ల ప్రశంసల వర్షాన్ని కురిపించారు వసీం అక్రమ్. వరల్డ్ కప్ లో ఇండియా ప్రదర్శన అద్భుతంగా ఉందని.. బ్రేకుల్లేని రైలులా వేగంగా ప్రత్యర్థులను ఢీకొడుతూ దూసుకువెళుతోందంటూ కితాబిచ్చారు వసీం అక్రమ్. ఇండియాకు మంచి నైపుణ్యం కలిగిన ప్లేయర్లు ఉన్నారు, ఏ జట్టుకు ఏ విధంగా ప్రణాళికలు అమలుచేయాలో బాగా తెలుసు..అందుకే వారు విజయాలను సాధిస్తున్నారు అంటూ అభినందించారు వసీం అక్రమ్.

ముఖ్యంగా ప్రతి జట్టు ఒత్తిడికి గురయ్యే ఛేదనలో ఎటువంటి టెన్షన్ కు గురి కాకుండా చాలా స్మూత్ గా టార్గెట్ ను ఛేదిస్తూ వెళుతోందంటూ గొప్పగా చెప్పారు వసీం అక్రమ్.

Read more RELATED
Recommended to you

Exit mobile version