అతను ఎవ్వరికీ తలవంచే రకం కాదు.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు

-

భారత మాజీ క్రికెటర్, ప్రస్తుత టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ గురించి కెప్టెన్ రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గౌతీ ఎవరికీ తలవంచే రకం కాదన్నాడు. ఏ పరిస్థితుల్లో చివరి వరకు పోరాడాలనే బలంగా భావిస్తాడన్నాడు. భారత క్రికెట్ డ్రెస్సింగ్ రూమ్ లో వాతావరణం చాలా బాగుందని రోహిత్ పేర్కొన్నాడు. మొన్నటివరకు రాహుల్ ద్రవిడ్ తో కలిసి పని చేసిన హిట్ మ్యాన్.. ఇప్పుడు గంభీర్ తో కలిసి జట్టును నడిపిస్తున్నాడు.

మొన్నటివరకు భారత జట్టుకు కోచ్ గా రాహుల్ ద్రవిడ్ పని చేశాడు. ఇప్పుడు గౌతమ్ గంభీర్ ఆ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. గౌతీ ఎవ్వరికీ తలవంచే రకం కాదు.. చివరి వరకు పోరాడాలనేదే అతని భావన. దేశం కోసం ఎన్నో కీలకమైన ఇన్నింగ్స్ ఆడిన వ్యక్తితో నేను ఇప్పుడు కలిసి పని చేస్తున్నా. నేను ఆడుతూ జట్టును ముందుకు నడిపించడమే కెప్టెన్ గా నా బాధ్యత అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version