కోహ్లీ, ధోని కూతుళ్లపై అసభ్యకర పోస్టులు.. FIR నమోదు !

-

విరాట్‌ కోహ్లీ, మహేంద్ర సింగ్‌ ధోనిల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. వారికి.. ఇండియాలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్‌ ఉంది. అయితే, తాజాగా కోహ్లీ, ధోనిలకు ఊహించని షాక్‌ తగిలింది. విరాట్‌ కోహ్లీ, మహేంద్ర సింగ్‌ ధోనిల కూతుళ్లపై అసభ్యకర మైన పోస్టులు పెట్టారు. చిన్నపిల్లలని చూడకుండా, వారిపై అసభ్యకర వ్యాఖ్యలతో పైశాచిక ఆనందం పొందుతున్నారు.

అయితే, ఈ ఆకతాయిల ఆటకట్టేందుకు ఏకంగా ఢిల్లీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ రంగంలోకి దిగారు. ధోనీ కూతురు జీవా, విరాట్ కోహ్లీ కుమార్తె వమికాపై కొంతమంది సోషల్ మీడియా వేదికగా చేసిన అసభ్యకర పోస్టులను స్క్రీన్ షాట్ తీసి, ఆమె తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసి, వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version