ఇండియా బీ రెడీ.. T20 వరల్డ్ కప్ ప్రోమో వీడియో ఔట్

-

క్రికెట్ లవర్స్కు గుడ్ న్యూస్. ప్రస్తుతం ఐపీఎల్ జాతరలో ఎంజాయ్ చేస్తున్న క్రికెట్ అభిమానులు ఇది పూర్తి కాగానే టీ20 ప్రపంచ కప్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. ఈ వరల్డ్ కప్ లో క్రికెట్ ప్రేమికులకు కావాల్సినంత వినోదం అందనుంది. జూన్లో వెస్టిండీస్, అమెరికా వేదికగా ప్రారంభం కానున్న ప్రపంచ కప్ కు సంబంధించిన ప్రముఖ బ్రాడ్కాస్టింగ్ ఛానెల్ స్టార్ స్పోర్ట్స్ ఓ ప్రోమో వీడియో రిలీజ్ చేసింది. తాజాగా విడుదల చేసింది ఐసీసీ. ప్రోమో ఇలా రిలీజ్ అయ్యిందో లేదో.. సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

2024 టీ20 వరల్డ్కప్ మరో 40 రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో స్టార్ స్పోర్ట్స్ ఛానెల్.. తాజాగా టీమ్ఇండియా కోసం స్పెషల్ ప్రోమో వీడియో రిలీజ్ చేసింది. ‘రోహిత్ సేన టీ20 వరల్డ్ కప్నకు సిద్ధమవుతోంది. వాళ్ల యాక్షన్ చూడడానికి మీరు సిద్ధమా?’ అని క్యాప్షన్ రాసుకొచ్చింది. ఇక వీడియో బ్యాక్ గ్రౌండ్లో ‘వందేమాతం’ సాంగ్ ప్లే చేశారు. ఈ లిరిక్స్ వీడియోలో హైలైట్గా నిలిచాయి. మీరు వీడియో చూశారా? ఇంకెందుకు ఆలస్యం మీరూ చూసేయండి మరి.

Read more RELATED
Recommended to you

Exit mobile version