India vs Bangladesh U19 Men’s Asia Cup Final Live Streaming: అండర్-19 ఆసియా కప్ తుది అంకానికి చేరుకుంది. ఇవాళ కీలక ఫైనల్స్ జరుగనుంది. భారత్-బంగ్లాదేశ్ మధ్య నేడు దుబాయ్ వేదికగా అండర్-19 ఆసియా కప్ తుది సమరం జరగనుంది. ఫైనల్ లో భారత్-బంగ్లాదేశ్ హోరాహోరీగా పోటీ పడనున్నాయి. 8 సార్లు కప్ గెలిచిన భారత్ ఓవైపు, డిఫెండింగ్ ఛాంపియన్ బంగ్లాదేశ్ మరోవైపు విజయం కోసం వ్యూహాలతో రెడీగా ఉన్నాయి.

ఇండియా టీమ్ ను 13 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఓపెనింగ్ లో అదర గొడుతుండగా, ఆయుష్ మెరుగైన సహకారాన్ని అందిస్తున్నాడు. బంగ్లాదేశ్ బౌలింగ్ లో పటిష్టం గా కనిపిస్తుండడం తో ఇరుజట్ల మధ్య హోరా హోరీగా పోటీ జరగనుంది. భారత్ – బంగ్లాదేశ్ మధ్య జరిగే మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.